Priyanka Dey thriller movie Haseena review in telugu
Priyanka Dey : సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లను ఇష్టపడే ఆడియెన్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్‌కు ఆ జానర్ ఎప్పుడూ ప్రత్యేకంగానే నిలుస్తుంటుంది. అయితే ఇప్పుడు కథ, కథనాలు బాగుంటే అన్ని జానర్లను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రియాంక డే టైటిల్ రోల్‌లో థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్, విశిష్ట నారాయణ, అభినవ్, శ్రేష్ట, గీతా సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం హసీనా. ఈ సినిమాకు తన్వీర్ ఎండీ నిర్మాతగా, ఎస్ రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Rajinikanth : రజినీకాంత్‌కి అదే చివరి సినిమా.. తమిళ దర్శకుడు సంచలన కామెంట్స్!
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి నవీన్ ఇరగాని దర్శకత్వం వహించారు. ఈ మూవీ నేడు మే 19న థియేటర్స్ లో రిలీజ్ అయింది. కథ విషయానికొస్తే చిన్నప్పట్నుంచి అనాథలు అయిన నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి స్నేహితులుగా కలిసి జీవిస్తారు. అయితే వీరు అనుకోకుండా ఓ హత్య చేయడంతో ఆ హత్య నుంచి ఎలా బయటపడ్డారు? ఈ క్రమంలో మరిన్ని హత్యలు ఎలా చేశారు? అసలు ఎందుకు హత్య చేశారు? వీళ్ళే చేశారా? వీరితో ఎవరైనా చేయించారా? అన్నట్టు సాగుతుంది.
Shah Rukh Khan : ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన అధికారి.. షారుఖ్ ఖాన్ నుంచి లంచం తీసుకున్నాడు!
ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ గా సాగినా, ఇంటర్వెల్ దగ్గర కథ ఆసక్తికరంగా మారుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో ట్విస్టుల మీద ట్విస్టులతో ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరూ ఉహించని ట్విస్టులు ఒకదాని తర్వాత ఒకటి రావడంతో ప్రేక్షకులు థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతారు. క్లైమాక్స్ మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ సినిమాకు హరీష్ కృష్ణ (చంటి) ఎడిటర్‌గా, రామ కందా కెమెరామెన్‌గా, షారుక్ షేక్ సంగీత దర్శకుడిగా పని చేశారు. నేపథ్య సంగీతాన్ని నవనీత్ చారి అందించారు. ఈ సినిమా టైటిల్ సాంగ్ రాహుల్ సిప్లిగంజ్ పాడాడు.