Priyanka Jawalkar
Priyanka Jawalkar : ట్యాక్సీవాలా సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి ప్రియాంక జవాల్కర్. ఈ సినిమాలో ఆమె నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ట్యాక్సీవాలా తర్వాత అమ్మడికి ఆఫర్లు క్యూకట్టాయి. వరుసరా తిమ్మరుసు, ఎస్.ఆర్ కల్యాణమండపం సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
ఈ రెండు సినిమాల్లో ఆమె నటన, అందం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అచ్చతెలుగు అమ్మాయి ప్రియాంక నార్త్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనని తన నటనతో నిరూపించుకుంది.
ఇక ఇదిలా ఉంటే ప్రియాంక తాజాగా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు అల్లు అర్జున్ అంటే క్రష్ అర్జున్ పై ఉన్న అభిప్రాయం బయటపెట్టింది. ఇక ఇదే సమయంలో విజయ్ దేవరకొండపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విజయ్ తనకంటే చిల్ అని కామెంట్ చేసింది.
ఇక తిమ్మరుసు హీరో సత్యదేవ్, ఎస్.ఆర్ కల్యాణమండపం హీరో కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతూ.. కిరణ్ చాలా ఇన్నోసెంట్ అని, కిడ్‌లా వ్యవహరిస్తుంటాడని, అలాగే సత్యదేవ్ చాలా హార్డ్ వర్కర్ అని చెప్పుకొచ్చింది. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. తెలుగులో కొన్ని కథలు విన్నానని, త్వరలో ఫైనల్ చేస్తానని తెలిపింది