Priyanka Mohan will paly female lead in Pawan Kalyan OG Movie
Priyanka Mohan : పవన్ కళ్యాణ్(Pawan kalyan) ప్రస్తుతం వరుస సినిమా షూట్స్ తో బిజీగా ఉన్నాడు. 2024 ఎలక్షన్స్ కి కొన్ని నెలల ముందే చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తిచేసి రాజకీయాల్లో బిజీ అవ్వాలని చూస్తున్నారు పవన్. దీంతో వరసగా ఓకే చేసిన సినిమాలకు డేట్స్ ఇస్తూ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. కొన్ని రోజుల క్రితమే వినోదయ సితం(Vinodaya Sitham) రీమేక్ సినిమా షూట్ ని 25 రోజులు వరుస డేట్స్ ఇచ్చి పూర్తి చేశాడు పవన్. ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) షూట్ మొదలవ్వగా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసేశాడు.
తాజాగా మంగళవారం నాడు పవన్ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న They Call Him OG సినిమా సెట్లోకి పవన్ అడుగుపెట్టాడు. సుజిత్ దర్శకత్వంలో, DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ హీరోగా గ్యాంగ్‌స్టర్ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా They Call Him OG. అప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలవ్వగా పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి షూట్ లో జాయిన్ అయ్యారు. సెట్ లో పవన్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. పవన్ లుక్ అదిరిపోయింది అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Pawan kalyan : OG సెట్ లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. OG వర్కింగ్ స్టిల్స్ గ్యాలరీ..
తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ ని ప్రకటించారు. కన్నడ భామ ప్రియాంక అరుళ్ మోహన్ OG సినిమాలో పవన్ సరసన నటించబోతోంది. ఇప్పటికే తెలుగులో శ్రీకారం, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలలో నటించి మెప్పించింది. తమిళ్ డాక్టర్, డాన్ సినిమాలతో కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రియాంక మోహన్. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ప్రియాంక కూడా షూటింగ్ లో జాయిన్ అయినట్టు సమాచారం. ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ OG సినిమా నుంచి అప్డేట్స్ ఇస్తుండటంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
???????? ?????… We are very happy & excited to have you on board for #OG. ❤️@PawanKalyan @PriyankaaMohan @sujeethsign @dop007 @MusicThaman #ASPrakash @DVVMovies #FireStormIsComing#TheyCallHimOG pic.twitter.com/OMED1rGkrF
— DVV Entertainment (@DVVMovies) April 19, 2023