Prodduturu Dasara
Prodduturu Dasara : బాల్కనీ ఒరిజినల్స్, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మాతగా మురళీ కృష్ణ తుమ్మ దర్శకత్వంలో తెరకెక్కించిన డాక్యుమెంటరీ ‘ప్రొద్దుటూరు దసరా’. ఇటీవల ఈ డాక్యమెంటరీని స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ స్క్రీనింగ్ కు డైరెక్టర్ కరుణ కుమార్, విప్లవ్, మహేష్ విట్టా, ఉదయ్ గుర్రాల.. పలువురు హాజరయ్యారు. ఈ డాక్యుమెంటరీని త్వరలోనే బయటకు రిలీజ్ చేయనున్నారు.
ఈ డాక్యుమెంటరీ స్పెషల్ స్క్రీనింగ్ తర్వాత డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ.. ఓ ఘటన, వ్యక్తికి సంబంధించిన నిజాల్ని చూపించే డాక్యుమెంటరీస్ ఎక్కువగా ఉంటాయి. ఓ మంచి డాక్యుమెంటరీకి సినిమా కంటే పెద్ద రీచ్ ఉంటుంది. డాక్యుమెంటరీ అంటే ఎంగేజింగ్‌గా ఉండదని అంతా అనుకుంటారు కానీ ఈ ప్రొద్దుటూరు దసరా చాలా ఎంగేజింగ్‌గా, అద్భుతంగా అనిపించింది. డాక్యుమెంటరీ అంటే ఇలానే తీయాలి అనే నియమాల్ని బద్దలు కొట్టారు. ఏఐని వాడుకుని కొన్ని సీన్స్ గొప్పగా చూపించారు అని అన్నారు.
Also See : Allu Arjun : అల్లు అర్జున్ నానమ్మ దశదిన కర్మ.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు.. ఫొటోలు..
నటుడు మహేష్ విట్టా మాట్లాడుతూ .. మా ఊర్లో జరిగే దసరా గురించి అందరికీ చెప్తాను నేను. పది రోజుల పాటు పండగ అదిరిపోతుంది. ఈ డాక్యుమెంటరీలో చూపించిన దాని కంటే ఇంకా బాగుంటుంది. పది టెంపుల్స్‌లో దసరా గొప్పగా జరుగుతుంది. 11 వ రోజు మాత్రం వాహనాలు కూడా వచ్చే స్థలం ఉండదు. మా ప్రొద్దుటూర్‌లో దసరా అద్భుతంగా జరుగుతుంది అని తెలిపాడు.
డైరెక్టర్ ఉదయ్ గుర్రాల మాట్లాడుతూ.. నేను కూడా డాక్యుమెంటరీలు తీసి ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రొద్దుటూరు దసరాని అక్కడి వాళ్లకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీశారు. తెలుగు రాష్ట్రాల్లో దసరాని ప్రొద్దుటూరులో ఇంత గొప్పగా చేస్తారని తెలియదు. ఈ డాక్యుమెంటరీ చూసిన తరువాత ప్రొద్దుటూరు దసరా గొప్పదనం తెలిసింది అని అన్నారు. నిర్మాత ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. బాల్కనీ ఒరిజినల్స్‌ని మూడేళ్ల క్రితం ప్రారంభించాము. ఇప్పటి వరకు మా ఏరియా అంటే వైలెన్స్ మాత్రమే ఉంటుందని అనుకుంటారు. ఇప్పుడు మా మూలాల్లోని కథల్ని చూపిస్తాను అని అన్నారు.
ఈ డాక్యుమెంటరీ డైరెక్టర్ మురళీ కృష్ణ మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు దసరా ప్రయాణంలో నాకు సహకరించిన నిర్మాత ప్రేమ్ కుమార్‌కు, అందరికి ధన్యవాదాలు. నా వరకు నేను ప్రయత్నించి ఈ డాక్యుమెంటరీని తీశాను అని అన్నారు.