Ashwini Dutt: ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయంపై నిర్మాత అశ్వనీ దత్ ఫైర్

టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వనీ దత్ స్పందించారు.

Ashwini Dutt: టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిర్మాతలు ఇలా షూటింగ్స్ బంద్‌కు పిలుపునివ్వడంతో ఇండస్ట్రీలో మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈ నిర్ణయానికి మద్దతు తెలుపుతుంటే.. స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్స్ వంటి వారు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఏదైనా సమస్య ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలని.. ఇలా షూటింగ్స్ బంద్ చేస్తే, సినీ కార్మికులకు తీవ్ర నష్టం కలుగుతుందని వారు అంటున్నారు.

Producers Guild: ఆగస్టు 1 నుండి షూటింగ్స్ బంద్.. అఫీషియల్‌గా ప్రకటించిన ప్రొడ్యూసర్స్ గిల్డ్

అయితే తాజాగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వనీ దత్ స్పందించారు. నిర్మాతల శ్రేయస్సు కోసమే అప్పట్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏర్పాటైందని.. కానీ ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు వచ్చిందో తెలియడం లేదని ఆయన అన్నారు. థియేటర్‌కు ప్రేక్షకులను రప్పించడం ఇప్పుడు దర్శకనిర్మాతలకు సవాల్‌గా మారిందని.. ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్లి టికెట్ ధరలు పెంచుకోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణంగా ఆయన తెలిపారు. ధరలు తగ్గించామని ఓసారి, పెంచామని మరోసారి చెప్పడం వల్లే సినిమాలపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగిందనేది వాస్తవం అని అశ్వనీ దత్ అన్నారు.

Shootings: షూటింగ్స్ బంద్.. ఏయే సినిమాలపై ప్రభావం?

టికెట్ ధరలు పెంచిన వాళ్లే ఇప్పుడు షూటింగ్స్ బంద్ అంటూ ఆందోళన చేస్తున్నారు. బడా ప్రొడ్యూసర్స్ తమకు ఇష్టం వచ్చినట్లుగా హీరోలకు పారితోషకాలు ఇస్తున్నారనడం ఏమాత్రం సరికాదని ఆయన మండిపడ్డారు. మార్కెట్ ధర ప్రకారమే హీరోల పారితోషకాలు ఉంటాయని ఆయన అన్నారు. చిత్ర పరిశ్రమలో సమస్యలు వస్తే గతంలో ఎన్టీఆర్, నాగేశ్వర్ రావు లాంటి హీరోలు సైతం రాలేదని.. ఏదైనా సమస్యలుంటే ఫిల్మ్ చాంబర్ స్వయంగా పరిష్కరించేది అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడున్న నిర్మాతల్లో స్థిరత్వం లేదని.. హీరోల పారితోషకాల వల్లే సినిమా టికెట్ ధరలు పెంచారనేది ఏమాత్రం వాస్తవం కాదని ఆయన అన్నారు.

ట్రెండింగ్ వార్తలు