Producer Bunny Vas makes interesting comments on Allu Arjun
Bunny Vas: సినిమా ఇండస్ట్రీ ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తుంది అనేది ఎవరికీ తెలియదు. ఇక్కడ కష్టం ఎంత అవసరమో అదృష్టం కూడా అంతే అవసరం. అలాంటి అదృష్టాన్ని వెంటనేపెట్టుకొని వచ్చాడు ఒక ప్రొడ్యూసర్. కేవలం రూ.45 కి ఆర్య సినిమాను కొని ఇప్పుడు ఏకంగా వందకోట్లతో సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. ఆ నిర్మాత మీరెవరో కాదు బన్నీవాసు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బన్నీ వాసు అనే పేరు తెలియనివారు ఎవరు లేరు. (Bunny Vas)మెగా, అల్లు ఫ్యామిలీలకు చాలా క్లోజ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున కి పిచ్చ ఫ్యాన్. ఆయనంటే అల్లు అర్జున్ కి కూడా చాలా ఇష్టం. అందుకే తన పేరులో బన్నీని యాడ్ చేసుకున్నాడు.
Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం.. స్వల్ప గాయాలు
ఇప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్ కి సంబందించిన వ్యవహారాలు అన్ని బన్నీ వాసునే చూసుకుంటున్నాడు. ఈమధ్య కాలంలో బన్నీ వాసు నుంచి వస్తున్న సినిమాలన్నీ దాదాపు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. లిటిల్ హార్ట్స్, మహావీర్ నరసింహా, రీసెంట్ గా కాంతార: చాఫ్టర్ 1. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ ఫుల్ హ్యాపీ గా ఉన్నాడు ఈ నిర్మాత. ఇందులో భాగంగానే, తాజాగా ఆయన నుంచి వస్తున్న సినిమా మిత్ర మండలి. కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ వాసు తన సినిమా ప్రయాణం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. “అల్లు అర్జున్ గారికి నేనంటే చాలా ఇష్టం. నమ్మకం కూడా. ఆయన ఏ డైరెక్టర్ దగ్గరైన స్టోరీ వినేముందు నన్ను కూడా కూర్చోపెట్టుకునేవాడు. అంతలా నమ్మేవారు. ఆర్య సినిమా విడుదల సమయంలో నువ్వు పాలకొల్లు లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసుకో నేను దిల్ రాజు మాట్లాడుతాను అని చెప్పారు. అలా దిల్ రాజు గారి దగ్గరకు వెళ్తే ఆయన వెస్ట్ గోదావరి మొత్తం తీసుకోమన్నాడు. నీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వు అన్నాడు. అప్పుడు నా దగ్గర కేవలం 45 రూపాయిలు మాత్రమే ఉన్నాయి. అది చూసి ఆయన నవ్వి మిగతావి తర్వాత ఇవ్వు అన్నాడు. అలా రూ.45 రూపాలతో మొదలైన నా ప్రయాణం ఇక్కడివరకు వచ్చింది అంటే దానికి కారణం అల్లు అర్జున్” అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ వాసు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.