Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం.. స్వల్ప గాయాలు
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రమాదానికి గురయ్యారు(Vijay Devarakonda). జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Vijay Devarakonda meets with car accident
Vijay Devarakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రమాదానికి గురయ్యారు. జోగులాంబ (Vijay Devarakonda)గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తన ఫ్యామిలీతో ప్రయాణిస్తున్న కారును బొలెరో కారు డీ కొట్టినట్టుగా తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడగా.. కారు స్వల్పంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
ఇక విజయ్ దేవరకొండకు శుక్రవారం ఉందయం స్టార్ బ్యూటీ రష్మిక మందన్నాతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తన కుటుంబంతో కలిసి పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నాడు. తిరుగు ప్రయాణంలోనే ఆయనకు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇక రష్మిక మందన్నతో ఎంగేజ్మెంట్ జరిగిన రెండురోజుల్లోనే ఈ ప్రమాదం జరుగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రమాదాం గురించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Akkineni Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్.. ‘కింగ్’ కి కలిసొస్తుందా?