Vijay Devarakonda meets with car accident
Vijay Devarakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రమాదానికి గురయ్యారు. జోగులాంబ (Vijay Devarakonda)గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తన ఫ్యామిలీతో ప్రయాణిస్తున్న కారును బొలెరో కారు డీ కొట్టినట్టుగా తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడగా.. కారు స్వల్పంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
ఇక విజయ్ దేవరకొండకు శుక్రవారం ఉందయం స్టార్ బ్యూటీ రష్మిక మందన్నాతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తన కుటుంబంతో కలిసి పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నాడు. తిరుగు ప్రయాణంలోనే ఆయనకు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇక రష్మిక మందన్నతో ఎంగేజ్మెంట్ జరిగిన రెండురోజుల్లోనే ఈ ప్రమాదం జరుగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రమాదాం గురించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Akkineni Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్.. ‘కింగ్’ కి కలిసొస్తుందా?