Akkineni Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్.. ‘కింగ్’ కి కలిసొస్తుందా?
అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) తన కెరీర్ లో ఒక ప్రత్యేకమైన మైల్ స్టోన్ కి చేరుకున్నారు. తన 100వ సినిమాకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. గత కొంతకాలంగా ఈ సినిమా గురించి వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Nagarjuna's 100th film has been titled Lottery King
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున తన కెరీర్ లో ఒక ప్రత్యేకమైన మైల్ స్టోన్ కి చేరుకున్నారు. తన 100వ సినిమాకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. గత కొంతకాలంగా ఈ సినిమా గురించి వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ, అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. కారణం ఏంటంటే? తన కెరీర్ లో ప్రత్యేకంగా వస్తున్న ఈ సినిమా విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదట నాగ్. పక్కాగా బ్లాక్ బస్టర్ సాధించాలని కంకణం(Akkineni Nagarjuna) కట్టుకున్నాడట. అందుకే, ప్రతీ విషయంలో క్లారిటీ వచ్చాకే డెసిషన్ తీసుకుంటున్నాడట.
ఇక ఈ సినిమాను తమిళ దర్శకుడు రా.కార్తీక్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి తనకు అచ్చొచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ కథను ఒకే చేశాడట కింగ్ నాగార్జున. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో నాగార్జునతో ఏకంగా ముగ్గరు హీరోయిన్స్ ఆడిపాడనున్నారట. నిజానికి ఈ సినిమాని దసరా కానుకగా మొదలుపెట్టాలని అనుకున్నారు మేకర్స్. కానీ, అనుకోని కారణాల వల్ల డిలే అయ్యింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు అక్టోబర్ నెలలోనే ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టాలని ఫిక్స్ అయ్యారట. దివాళి రోజున లక్ష్మి పూజతో ఈ సినిమాను మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఈ సినిమాకు “లాటరీ కింగ్” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారట. నాగార్జునను ఆయన ఫ్యాన్స్ ప్రేమగా కింగ్ అని పిలుచుకుంటారు. ఆ ట్యాగ్ ని మ్యాచ్ చేస్తూ ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమాకి ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ కూడా క్యాచీగా ఉండటంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ కూడా కనిపించబోతున్నారట. అయితే, అవి స్పెషల్ రొల్సా లేక క్యామియో అనేది తెలియాల్సి ఉంది. మరి, తన కెరీర్ లో 100వ సినిమాతో వస్తన్న నాగార్జున ఆడియన్స్ ను ఏమేరకు మెప్పిస్తారు అనేది చూడాలి.