×
Ad

Bunny Vasu : ఎంత గొప్ప రచయిత అయినా ఈ క్లైమాక్స్‌ ఊహిస్తే మీరు దేవుళ్లతో సమానం.. ‘క’ సినిమాపై బన్నీ వాసు ఆసక్తికర వ్యాఖ్యలు..

క సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ కిరణ్ గురించి, సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Producer Bunny Vasu Interesting Comments on Kiran abbavaram and Ka movie

Bunny Vasu : కిరణ్ అబ్బవవరం ఇటీవల దీపావళికి క సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. ఏకంగా 30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టాడు. చింతా గోపాల్ రెడ్డి నిర్మాణంలో సుజీత్, సందీప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎవరూ ఊహించని క్లైమాక్స్ తో సస్పెన్స్ థ్రిల్లర్ తో క సినిమా ప్రేక్షకులని మెప్పించింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.

క సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ కిరణ్ గురించి, సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బన్నీ వాసు మాట్లాడుతూ.. నాకు మనస్పూర్తిగా అనిపిస్తే తప్ప నేను ఇలాంటి వేడుకలకు రాను. ఈ సినిమా గురించి మాట్లాడాలి అని వచ్చాను. నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. నేను ఎన్నో కథలు వింటుంటాను. దాంతో సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఊహించగలం. కానీ ఈ సినిమా క్లైమాక్స్‌ నేను ఊహించలేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ స్క్రీన్‌ప్లే ఇది. స్క్రీన్‌ప్లేలో చిన్న తప్పు కూడా లేదు. క్లైమాక్స్ కు, స్క్రీన్‌ప్లే విషయంలో క్లాప్స్‌ పడ్డాయి. మీరు ఎంత గొప్ప రచయిత అయినా ఈ సినిమా క్లైమాక్స్‌ ఊహిస్తే మీరు దేవుళ్లతో సమానం అని అన్నారు.

Also Read : Ram Charan : అయ్యప్ప మాలలో రామ్ చరణ్.. ఇక గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ దీక్షలోనే..

అలాగే.. ఈ సినిమా బడ్జెట్‌ విని షాక్‌ అయ్యాను. నిర్మాత గట్స్ కు అభినందనలు. కిరణ్‌, వంశీ నాకు దగ్గరయిన వ్యక్తులు. వంశీ నందిపాటి నాకు రేట్‌ చెప్పకుండా కొన్నాడు. ఆ తర్వాత రేట్‌ తెలిసి షాక్‌ అయ్యాను. మొదట కంగారు పడ్డాను. కానీ సినిమా చూసిన తర్వాత వీళ్ల క్యాలికేలేషన్స్‌, వంశీ నమ్మకం నిజమైంది. వంశీ సినిమాను నమ్మాడు కాబట్టే ఈ రోజు డబ్బులు వచ్చాయి. సినీ పరిశ్రమలో ఛాన్స్‌ క్రియేట్‌ చేసుకున్న వ్యక్తులు ఎదుగుతారు. కిరణ్‌ అవకాశం క్రియేట్‌ చేసుకున్నాడు. చాలా మంది కిరణ్‌ పడిపోయాడు, పని అయిపోయింది అన్నారు. కానీ అతను ఫైట్‌ ఆపలేదు. కిరణ్‌ ఎప్పుడు సినిమాను వదల్లేదు. అందుకే కిరణ్‌ గెలిచాడు. కిరణ్‌ ను చూస్తే ఇన్‌స్పిరేషన్‌ వస్తుంది. సక్సెస్‌ వచ్చేవరకు ఫైట్‌ చేయాలి కిరణ్ లాగా అని అన్నారు.