Producer Bunny Vasu made interesting comments about Allu Arjun next two films.
Bunny Vasu: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం(AK 47) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా షూటింగ్ మొదలైన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. త్రివిక్రమ్ ఇప్పటికే వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి లాంటి సినిమాలకు కథ మాటలు అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వెంకటేష్ మొదటిసారి హీరోగా చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
Divvela Madhuri: అనసూయ అతి చేస్తోంది.. రెచ్చిపోయిన దివ్వెల మాధురి.. ఆ మాట కూడా అనేసింది..
ఇదిలా ఉంటే, ఈ సినిమా కంటే ముందే త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక మైథలాజికల్ సినిమా ప్లాన్ చేశాడు. ఆ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. కానీ, అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. కానీ, అదే కథతో ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి సినిమా చేయాలనీ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. ఈ ప్రాజెక్టుపై కొంతకాలం చర్చలు కూడా నడిచాయి. ఇక అధికారిక ప్రకటన చేసి సినిమాను మొదలుపెట్టడమే ఆలస్యం అనుకున్నారు అంతా. ఈ ప్రాజెక్టుపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నారు.
కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు మళ్ళీ అల్లు అర్జున్ వద్దకే వెళ్లినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu)ని ఒక రిపోర్టర్ అడిగాడు. దానికి సమాధానంగా బన్నీ వాసు మాట్లాడుతూ.. “అట్లీ సినిమా తరువాత అల్లు అర్జున్ రాబోయే రెండు సినిమాల విషయంలో మేము చాలా క్లారిటీగా ఉన్నాము. అందులో ఒకటి 2026 జూన్ లో మొదలవుతుంది. రెండోవది 2027 మిడ్ లో స్టార్ట్ అవుతుంది. కానీ, వాటి దర్శకులు ఎవరు అనేది త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాము. ఎందుకంటే, ఇది చాలా సెన్సిటీవ్ ఇష్యు. అందుకే, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కాస్త పేషెన్స్ గా ఉండండి”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో బన్నీ వాసు చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.