Site icon 10TV Telugu

Tollywood Strike : టాలీవుడ్ లో సమ్మెపై నిర్మాతల మండలి మీటింగ్.. బంద్ కి ఎలా వెళ్తారు? బయట కంటే ఎక్కువ ఇస్తున్నాం..

Producer Comments on Tollywood Strike after Meeting

Tollywood Strike

Tollywood Strike : టాలీవుడ్ సినీ కార్మికులకు ఏకంగా 30 శాతం వేతనాలు పెంచాలని ఫిలిం ఫెడరేషన్ చేసిన ప్రతిపాదనలను ఫిలిం ఛాంబర్ ఒప్పుకోకపోవడంతో నేటి నుంచి టాలీవుడ్ లో సమ్మె జరుగుతుంది. ఫిలిం ఫెడరేషన్ సినీ కార్మికులను షూటింగ్స్ కి ఎవరూ వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేసింది. 5 శాతం పెంచుతామన్నా ఒప్పుకోలేదు.

దీంతో ఫిలిం ఛాంబర్ కూడా ఇప్పటికే ఎక్కువ ఇస్తున్నాం, నిర్మాతలు ఎవరూ ఎక్కువ డబ్బులు ఇచ్చి షూటింగ్ కి వెళ్లొద్దు అన్నారు. దీనిపై తాజాగా ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల మండలి మీటింగ్ జరిగింది. అయితే 30 శాతం వేతనాల పెంపుపై ఏ విషయం తేల్చలేదు. నిర్మాతలు వేతనాలు పెంచడానికి ఇష్టపడలేదు. లేబర్ కమిషన్ కార్మికులకు షూటింగ్స్ బంద్ కి వెళ్లవద్దని చెప్పిన తరువాత కూడా, లేబర్ కమిషన్ అండర్ లో విషయం ఉన్నప్పుడు బంద్ ఎలా ప్రకటిస్తారు అన్న దానిపై చర్చ జరిగిందని నిర్మాతలు తెలిపారు.

Also Read : Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా.. నాని చేతుల మీదుగా ఓపెనింగ్.. ఫొటోలు..

నేడు సాయంత్రం లేబర్ కమీషనర్ ను ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ సభ్యులు కలవనున్నారు. ఈ క్రమంలో నిర్మాతల మండలి మీటింగ్ అనంతరం నిర్మాత విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. సినీ కార్మికులకు బయట ఉన్న కార్మికుల కంటే ఎక్కువ పే చేస్తున్నాము. సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కంటే కూడా వీరికి వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. బంద్ చేసే హక్కు అందరికీ ఉంటుంది. వేతనాల పెంపు పర్సంటేజ్ పై ఇంకా చర్చ జరుగుతోంది, ఎలాంటి నిర్ణయం తీసుకొలేదు‌‌ అని తెలిపారు.

Exit mobile version