Producer Dil Raju is planning another film with Pawan Kalyan
Dil Raju: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మరో భారీ సినిమా స్కెచ్ వేశారు. ఇప్పటికే ఆయన పలు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరో డేట్స్ పట్టేశాడట. ఆ స్టార్ మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ స్టార్(Dil Raju) హీరో ప్రస్తుతం ఓజీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమా రావడంతో ఆడియన్స్ కూడా ఓజీ సినిమాను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ కి సరైన కంటెంట్ పడితే ఎలా ఉంటుంది అనేది ఓజీ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. విడుదలైన కేవలం వారం రోజుల్లోనే రూ.360 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఓజీ.
ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఓజీ సక్సెస్ తో దానికి ప్రీక్వెల్, సీక్వెల్ ను అనౌన్స్ చేశాడు పవన్ కళ్యాణ్. ఈ రెండు సినిమాలే కాకుండా దర్శకుడు హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమానే పవన్ కెరీర్ లో చివరి సినిమా అనుకున్నారు అంతా. కానీ, ఆడియన్సన్ కి సర్ప్రయిజ్ ఇస్తూ మరో సినిమాకి కమిట్ అయ్యాడట పవన్.
అది కూడా రీ ఎంట్రీలో ఆయనకు వకీల్ సాబ్ లాంటి సూపర్ హిట్ అందించిన నిర్మాత దిల్ రాజుతో. ఇటీవల ఓజీ సక్సెస్ మీట్ కి హాజరైన దిల్ రాజు పవన్ కళ్యాణ్ కి ఒక రిక్వెస్ట్ చేశారు. మీరు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కనీసం సంవత్సరానికి ఒక సినిమా చేయాలి సార్ అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ రిక్వెస్ట్ కి ఆన్సర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఓజీ సక్సెస్ మీట్ లో కలిసిన పవన్ కళ్యాణ్ ను నెక్స్ట్ సినిమా కోసం డేట్స్ అడిగాడట దిల్ రాజు. వకీల్ సాబ్ లాంటి కథతో వస్తే తప్పకుండా చేద్దాం అని చెప్పాడట పవన్ కళ్యాణ్. దాంతో, ఫుల్ ఖుషి అయిన దిల్ రాజు ఇప్పుడు మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కథ కోసం, దర్శకుడి కోసం చూస్తున్నాడట. అయితే, తమ సంస్థలో వకీల్ సాబ్ లాంటి మెమరబుల్ ప్రాజెక్టు ఇచ్చిన దర్శకుడు వేణు శ్రీరామ్ నే ఈ సినిమా కోసం తీసుకుంటాడా లేక కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడా అనేది చూడాలి. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.