నిర్మాత కోనేరు అనిల్ మరణం : నాని ఎమోషనల్ ట్వీట్

నిర్మాత కోనేరు అనిల్ మరణవార్త తెలియగానే నేచురల్ స్టార్ కాస్త ఎమోషన్‌కి లోనయ్యాడు..

  • Publish Date - April 27, 2019 / 10:22 AM IST

నిర్మాత కోనేరు అనిల్ మరణవార్త తెలియగానే నేచురల్ స్టార్ కాస్త ఎమోషన్‌కి లోనయ్యాడు..

ఒట్టేసి చెబుతున్నా, రాధా గోపాళం, అల్లరి బుల్లోడు, సుందరకాండ (2008) వంటి సినిమాలను నిర్మించిన నిర్మాత కోనేరు అనిల్ కుమార్ (53) కన్నుమూసారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఏప్రిల్ 26 రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం విజయవాడ.
ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు అని పలువురు సినీ పెద్దలు చెప్పారు. అనిల్ మరణవార్త తెలియగానే నేచురల్ స్టార్ కాస్త ఎమోషన్‌కి లోనయ్యాడు. ‘నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా తొలిజీతం ఆయన సంతకంతోనే తీసుకున్నాను.. ఆయన నా ఫస్ట్ ప్రొడ్యూసర్, నా మెంటార్, ఆయన మా ఫ్యామిలీలోని మెంబర్ లాంటివారు.. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాం.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’.. అంటూ ఎమోషనల్‌గా ట్వీట్ చేసాడు నాని. దర్శకుడు హరీష్ శంకర్, రచయిత గోపి మోహన్ కూడా అనిల్ మృతికి సంతాపం తెలియచేస్తూ ట్వీట్ చేసారు.