Naga Vamsi : ‘గుంటూరు కారం’కు ఎలాంటి రివ్యూలు ఇచ్చిన పర్లేదు.. సినిమా బ్లాక్ బస్టర్.. మరోసారి రివ్యూల గురించి చర్చ..

తాజాగా మరోసారి రివ్యూల గురించి చర్చ వచ్చింది. ఆదికేశవ(Aadikeshava) సినిమా ప్రమోషన్స్ లో మీడియా చిత్రయూనిట్ ని ప్రశ్నలు వేస్తుండగా రివ్యూల గురించి చర్చ రావడంతో నిర్మాత నాగవంశీ..

Producer Naga Vamsi Comments on Reviews and Mahesh Babu Guntur Kaaram Movie

Naga Vamsi : సినీ పరిశ్రమలో రివ్యూల మీద చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. సినిమా నిర్మాతలు రివ్యూలు ఇచ్చేవాళ్ళని తొందరగా ఇవ్వొద్దని, రివ్యూలు రాసేవాళ్ళు సినిమా చూడగానే రివ్యూ ఇచ్చేయాలని అంటూనే ఉంటారు. రివ్యూల విషయంలో తాజాగా మరోసారి సినీ పరిశ్రమలో చర్చలు జరుగుతున్నాయి.

ఇటీవల కోటబొమ్మాళి PS సినిమా ప్రమోషన్స్ లో కొత్తగా పలువురు సీనియర్ జర్నలిస్టులు స్టేజిపై కూర్చోగా నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, SKN, బన్నీ వాసు.. పలువురు కింద కూర్చొని ప్రశ్నలు అడిగారు. ఈ నేపథ్యంలో రివ్యూల గురించి డిస్కషన్ వచ్చి సినిమా రిలీజ్ కి ముందే, రిలీజ్ అవ్వగానే కొంతమంది రివ్యూలు ఇచ్చి సినిమాని చంపేస్తున్నారని, ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే సినిమా గురించి మరింత వరస్ట్ గా రాస్తున్నారని దాని వల్ల నిర్మాతలు చాలా నష్టపోతున్నారని అన్నారు. వీకెండ్ వరకు మొదటి మూడు రోజులు అయినా కుదిరితే రివ్యూలు ఆపాలని అన్నారు. ఈ చర్చ టాలీవుడ్ లో వైరల్ గా మారింది.

తాజాగా మరోసారి రివ్యూల గురించి చర్చ వచ్చింది. ఆదికేశవ(Aadikeshava) సినిమా ప్రమోషన్స్ లో మీడియా చిత్రయూనిట్ ని ప్రశ్నలు వేస్తుండగా రివ్యూల గురించి చర్చ రావడంతో నిర్మాత నాగవంశీ.. కనీసం ఒక్క శుక్రవారం అయినా రివ్యూ రాయకుండా ఆగండి, రివ్యూల వల్ల నిజంగానే కొన్ని సినిమాలు చచ్చిపోతున్నాయి అని అన్నారు. దీనికి మీడియా వాళ్ళు చిన్న సినిమాల్లో బాగున్నవి రివ్యూలు రాస్తే వాటి వల్లే సినిమాలకు ప్లస్ అవుతుంది కదా అని ప్రశ్నించారు. కొంతమంది ట్విట్టర్ లో టైటిల్ కార్డు నుంచి ప్రతిదానికి రివ్యూ ఇస్తున్నారని నాగవంశీ అన్నారు. ఇలా రివ్యూల గురించి మరోసారి చర్చ జరిగింది.

Also Read : RT4GM : రవితేజ – గోపీచంద్ సినిమా ఆగిపోయిందా? కారణం ఏంటి? ఈ కాంబోలో ఇంకో హిట్ ఉంటుందా?

అయితే ఈ సందర్భంలో మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా ప్రస్తావన రాగా నిర్మాత నాగవంశీ.. అసలు గుంటూరు కారం సినిమాకు ఏ రివ్యూలు, ఎలా రాసుకున్న పర్లేదు. మీ ఇష్టమొచ్చినట్టు రివ్యూలు రాసుకోండి. సినిమా మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అన్నారు. దీంతో నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మహేష్ అభిమానులు నిర్మాత ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని భావిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరుకారం సినిమా సంక్రాంతికి జనవరి 12న రాబోతుంది.

 

 

ట్రెండింగ్ వార్తలు