Producer Naga Vamsi interesting comments about his upcoming movies
Naga Vamsi: టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థగా మారింది సితార ఎంటర్టైన్మెంట్. ఈ సంస్థ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఖచ్చింతగా విషయం ఉంటుంది అనేలా తన సత్తా చాటుకున్నాడు నిర్మాత నాగ వంశీ(Naga Vamsi). ఈ సమస్త నుంచి వస్తున్న కొత్త సినిమా ‘అనగనగా ఒక రాజు’. నవీన్ పిలిశెట్టి-మీనాక్షి చౌదరి జంటగా నటిస్తుండగా దర్శకుడు మారి తెరకెక్కిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నాగ వంశీ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
Varanasi-AA22: ఇదెక్కడి క్రేజ్ రా మామా.. వారణాసి కంటే అల్లు అర్జున్ సినిమాకే ఎక్కువ..
ఈ మధ్య సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి వస్తున్న సినిమాల గురించి దర్శకుడు త్రివిక్రమ్ నాగ వంశీకి క్లాస్ పీకాడట. “2025 సెకండ్ హాఫ్ లో మా సంస్థ నుంచి వచ్చిన కొన్ని సినిమాలు సరిగా ఆడలేదు. దాని గురించి త్రివిక్రమ్ గారు నాతో మాట్లాడారు. అన్నిట్లో వేలు పెట్టొద్దు. మనకంటూ ఒక కోర్ జానర్ ఉంది. దాన్ని నమ్ముకొని ముందుకు వెళదాం. ఆడియన్స్ కూడా ఆ విషయంలో మనల్ని నమ్ముతున్నారు. వీళ్ళు ఈ జానర్ అయితే చాలా బాగా చేస్తారు అనే నమ్మకం వచ్చింది. కాబట్టి, ఆ జానర్ ని మిస్ చేయకూడదు. అందుకే, అదే స్పేస్ లో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇక నుంచి ప్రయోగాలు చేయడకుండా. మనపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకుందాం అనే ప్రయత్నాలు చేస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో నాగ వంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.