Leo Movie : లియో తెలుగు రిలీజ్ పై కోర్టు స్టే ఆర్డర్.. స్పందించిన నిర్మాత నాగవంశీ..

లియో రిలీజ్ ని అక్టోబర్ 20 వరకు నిలిపివేయాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇక దీని పై తెలుగు లియో మూవీ డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ రియాక్ట్ అవుతూ..

producer Naga Vamsi press meet about Leo Movie telugu release date

Leo Movie : లోకేష్‌ కనగరాజ్‌, ఇళయ దళపతి విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘లియో’. ఖైదీ, విక్రమ్‌ సినిమాల తరువాత లోకేష్ నుంచి వస్తున్న మూవీ కావడం, గతంలో విజయ్ తో మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ ని లోకేష్ తెరకెక్కించడం.. ఇప్పుడు లియో పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. తమిళంతో పాటు తెలుగులో మంచి హైప్ నెలకుంది. ఇక కొన్ని రోజులు నుంచి ఈ మూవీలో రామ్ చరణ్ కూడా గెస్ట్ రోల్ చేయబోతున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తుండడంతో తెలుగులో మరింత బజ్ క్రియేట్ అయ్యింది.

అక్టోబరు 19న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతున్న ఈ మూవీకి.. అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తమిళనాడులో లియో మార్నింగ్ షోలకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇక తెలుగులో ఏమో ఈ మూవీ రిలీజ్ ని అడ్డుకుంటూ కోర్టు నోటీసులు పంపింది. లియో టైటిల్ తో ఆల్రెడీ తెలుగులో ఒక సినిమా రిజిస్టర్ అయ్యిందట. దీంతో ముందుగా రిజిస్టర్ చేయించుకున్న వారు కోర్టుని ఆశ్రయించారు. ఇక దీనిపై స్పందించిన న్యాయస్థానం.. లియో రిలీజ్ ని అక్టోబర్ 20 వరకు నిలిపివేయాలంటూ నోటీసులు జారీ చేసింది.

Also read : National Film Awards : విజ్ఞాన్ భవన్‌లో నేషనల్ అవార్డులు అందుకున్న టాలీవుడ్..

ఇక దీని పై తెలుగు లియో మూవీ డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ రియాక్ట్ అయ్యాడు. ప్రెస్ మీట్ పెట్టి సినిమా రిలీజ్ లో ఎటువంటి మార్పు లేదు అక్టోబర్ 19కే వస్తుందంటూ తెలియజేశారు. అసలు ఈ టైటిల్ విషయం ముందుగా తమ దృష్టికి రాలేదని, పలానా వ్యక్తి కోర్టులో కేసు నమోదు చేయడం, దాని గురించి ఒక విలేకరి చెప్పడం వలనే తమకి తెలిసిందంటూ నాగవంశీ పేర్కొన్నాడు. కేసు వేసిన వ్యక్తితో మాట్లాడి ప్రాబ్లెమ్ పరిష్కరిస్తాము అంటూ వెల్లడించాడు. దీంతో ఈ మూవీ తెలుగు రిలీజ్ డేట్ పై ఉన్న కన్‌ఫ్యూజన్ తొలిగిపోయింది.