Producer Ravi clarifies on Ustad Bhagat Singh remake comments
Ustaad Bhagat Singh: ఓజీ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమా తరువాత కూడా అదే జోష్ ను కంటిన్యూ చేయాలనీ అనుకుంటున్నాడు. ఆయన నుంచి వస్తున్న కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అవుతోంది.
Nayanthara: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు.. ఆ సినిమా చేయడమే.. కేవలం గ్లామర్ డాల్ గా చూపించారు..
అయితే, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తమిళ తేరి సినిమాకు రీమేక్ గా వస్తుంది అనే కామెంట్స్ చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు వర్క్ చేసిన చాలా మంది కూడా గతంలో అదే మాటను చెప్పారు.కథ అదే కానీ, చాలా చేంజెస్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో, ఆడియన్స్ ఈ సినిమాపై అంత ఇంట్రెస్ట్ గా లేరు అన్నట్టుగా కామెంట్స్ వచ్చాయి. కానీ, సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన కంటెంట్, టీజర్, పోస్టర్స్ అభిమానుల్లో ఆశలు చిగురించేలా చేశాయి. ఇప్పుడు తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కామెంట్స్ పై స్పందించాడు నిర్మాత రవి. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఈ సినిమా గురించి చెప్పుకొచ్చాడు.
“ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సాలిడ్ కంటెంట్ ఉంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కంటెంట్ ను సెట్ చేశాడు దర్శకుడు. రీమేక్ అని ఎక్కడ అనిపించే ప్రసక్తే లేదు. ఫుల్ మాస్, ఫుల్ పవర్‌తో సినిమా ఉంటుంది. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ కన్ఫర్మ్”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా 2026 ఏప్రిల్ లో విడుదల కానుంది.