Ravindar-Mahalakshmi : ప్రేమకి అందంతో పని లేదని నిరూపించారు.. వైరల్ అవుతున్న నిర్మాత, నటి పెళ్లి ఫొటోలు..

తమిళ నిర్మాత, నటి పెళ్లి ఫొటోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీరియల్ నటి, వీజే మహాలక్ష్మీ, తమిళ నిర్మాత రవిందర్ చంద్రశేఖర్ ని తాజాగా తిరుపతిలో పెళ్లి చేసుకుంది. బంధుమిత్రుల సమక్షంలో .............

Producer Ravindar tied the knot with the Popular VJ and Actress Mahalakshmi

Ravindar-Mahalakshmi :  సినీ పరిశ్రమలో వాళ్ళు సినీ పరిశ్రమ వాళ్లనే పెళ్లి చేసుకోవడం కొత్తేమి కాదు. కానీ ఈ తమిళ నిర్మాత, నటి పెళ్లి ఫొటోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీరియల్ నటి, వీజే మహాలక్ష్మీ, తమిళ నిర్మాత రవిందర్ చంద్రశేఖర్ ని తాజాగా తిరుపతిలో పెళ్లి చేసుకుంది. బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుకల ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

వీరిద్దరికి గతంలోనే వేరు వేరు పెళ్లిళ్లు అయ్యాయి, అయితే వీరిద్దరూ కూడా వారి పాస్ట్ రిలేషన్ షిప్స్ తో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మహాలక్ష్మి నిర్మాత రవీందర్ సినిమాల్లో నటిస్తుంది. ఈ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు వెళ్ళింది. అయితే రవీందర్ చాలా లావుగా ఉండటం, నల్లగా ఉండటం, ఈమేమో హీరోయిన్ అవ్వడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి జనాలు ఆశ్చర్యపోయారు. ఇక పెళ్లి ఫొటోలు బయటకి వచ్చాక నిజమే అని షాక్ అయ్యారు.

Hero Nikhil : కార్తికేయ 2 హిట్‌తో నిఖిల్‌కి క్యూ కడుతున్న బాలీవుడ్ ఆఫర్లు..

 

i

నటి మహాలక్ష్మి లావుగా ఉన్న నిర్మాత రవీందర్ ని చేసుకోవడంతో కొంతమంది ప్రేమకి అందంతో పని లేదు అంటూ మహాలక్ష్మిని పొగుడుతున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం డబ్బు ఉంటే అందంతో పని లేదు, అతను నిర్మాత, అతని దగ్గర బాగా డబ్బులున్నాయి, అంతే కాక ఇది వాళ్ళిద్దరికీ రెండో పెళ్లి అందుకే చేసుకుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఏది నిజమో తెలీదు కానీ వీరిద్దరి పెళ్లి ఫొటోలు మాత్రం చర్చగా మారాయి.