Producer Shobhu Yarlagadda makes shocking comments about the movie Baahubali The Epic
Bahubali: The Epic: తెలుగు స్థాయిని ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటిన సినిమా బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ గా బాహుబలి 2 సినిమా వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన (Bahubali: The Epic)ఈ సినిమా ఏకంగా రూ.1800 కోట్ల వసూళ్లు సాధించి కనీవినీ ఎరుగని సంచనాలు క్రియేట్ చేసింది. ప్రెజెంట్ నడుస్తున్న పాన్ ఇండియా ట్రెండ్ ను క్రియేట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన సినిమా బాహుబలి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Srikanth Iyengar: గాంధీ మహాత్ముడు ఎలా అయ్యాడు.. అతను ఒక.. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు
ఇప్పుడు ఈ సినిమా మరోసారి ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతోంది. బాహుబలి, బాహుబలి 2 రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాగా విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు బాహుబలి: ది ఎపిక్ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లను ప్లాన్ చేశారు మేకర్స్. అలాగే, ఈ సినిమా ఎండింగ్ లో బాహుబలి 3కి సంబందించిన హింట్ ఇవ్వనున్నారు అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించాడు. బాహుబలి: ది ఎపిక్ ఎండింగ్ లో బాహుబలి 3 గురించి అనౌన్స్ మెంట్ ఉంటుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవి కేవలం రూమర్స్ మాత్రమే. కానీ, కొన్ని సర్ ప్రైజ్ లు మాత్రం ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు.
దీంతో, బాహుబలి సినిమాకు సీక్వెల్ గా 3 కూడా ఉంటుంది అని ఆశపడ్డ ఫ్యాన్స్ కు నిరాశే ఎదురయ్యింది. ఇక ఇప్పటికే కొన్ని వందల సార్లు చూసిన సినిమా బాహుబలి. అయినప్పటికి ఈ సినిమాను మళ్ళీ థియేటర్స్ లో చూసేందుకు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అలాగే రిలీజ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. దర్శకుడు రాజమౌళి సైతం మహేష్ బాబు సినిమా షూటింగ్ కి పులిష్టాప్ పెట్టి మరీ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు అంటే ఎంత పక్కాగా ప్లాన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి మళ్ళీ కొత్తగా విడుదలవుతున్న బాహుబలి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.