×
Ad

Producer SKN : రష్మిక సినిమా చూసి చున్నీ తీసేసిన అమ్మాయి.. కౌంటర్ ఇచ్చిన SKN..

ఈ ఘటనపై నిర్మాత SKN స్పందించాడు. (Producer SKN)

Producer SKN

Producer SKN : ఇటీవల రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజయింది. ఈ సినిమాలో టాక్సిక్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయి ఎలా ఇబ్బందిపడుతుంది అనే కథని చూపించారు. ఈ సినిమా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని మెప్పించింది. ఈ సినిమా చూసి కొంతమంది అమ్మాయిలు సోషల్ మీడియాలో తమ రివ్యూలను చెప్తూ, కొంతమంది తాము కూడా అలా ఫేస్ చేశామని చెప్తూ పోస్టులు పెడుతున్నారు.(Producer SKN)

ఇటీవల రాహుల్ రవీంద్రన్ ఓ థియేటర్ కి వెళ్ళాడు. అక్కడ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ రాహుల్ తో మాట్లాడారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి రాహుల్ దగ్గరికి వచ్చి సినిమా బాగుందని చెప్పి, సినిమా చివర్లో రష్మిక చున్నీ తీసేసినట్టు తాను కూడా తీసేస్తాను అని మెడలో ఉన్న చున్నీ తీసేసి లైఫ్ ని ఫేస్ చేస్తాను అని తెలిపింది. దానికి రాహుల్ నాకు ఇది నచ్చింది అని ఆ అమ్మాయిని హగ్ చేసుకోవడంతో వీడియో వైరల్ గా మారింది.

Also Read : Yenugu Thondam Ghatikachalam : 25 ఏళ్ళ యువతి 64 ఏళ్ళ ముసలోడు.. శోభనం రాత్రి బిగ్ ట్విస్ట్.. ‘ఏనుగుతొండం ఘటికాచలం’ రివ్యూ..

ఆ అమ్మాయి చేసిన దానిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. పలువురు సినిమాలో మెసేజ్ అర్ధం చేసుకోమంటే ఇలా చున్నీలు తీయమని కాదు అని ఆమెపై ట్రోల్స్ వేస్తున్నారు. మరికొంతమంది ఆమెని సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై నిర్మాత SKN స్పందించాడు.

రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ లో SKN మాట్లాడుతూ.. బంగారు తల్లులు రాహుల్ రవీంద్ర గారు ఈ సినిమా తీసింది మీలో భయాన్ని పోగొట్టాలని కానీ చున్నీలు ఎగరేయాలని కాదమ్మా. పొద్దున్నుంచి ధీరజ్ గారి ఆఫీస్ ముందు అందరూ బట్టల షాప్ వాళ్ళు ఉన్నారు. మా చున్నీల సేల్స్ పడిపోతాయి అని. అందుకే చున్నీ వేసుకొని హ్యాపీగా సినిమా చూడొచ్చు. మీకు కంఫర్ట్ గా ఉంటె ఏ డ్రెస్ అయినా వేసుకోండి కానీ ఈ సినిమాలో ఇచ్చిన మెసేజ్ భయాన్ని వదిలేయండి అని అంతే కానీ వేరే ఏది వదిలేయమని కాదు అని కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఆ అమ్మాయి వీడియో, SKN స్పీచ్ లతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Also Read : The Girlfriend Success Meet : రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ మీట్.. హాజరయిన బాయ్ ఫ్రెండ్.. ఫొటోలు వైరల్..