Yenugu Thondam Ghatikachalam : 25 ఏళ్ళ యువతి 64 ఏళ్ళ ముసలోడు.. శోభనం రాత్రి బిగ్ ట్విస్ట్.. ‘ఏనుగుతొండం ఘటికాచలం’ రివ్యూ..

రవిబాబు డైరెక్షన్ సినిమాలు అంటే సరికొత్తగా ఉంటాయి, అందర్నీ మెప్పిస్తాయని తెలిసిందే. (Yenugu Thondam Ghatikachalam)

Yenugu Thondam Ghatikachalam : 25 ఏళ్ళ యువతి 64 ఏళ్ళ ముసలోడు.. శోభనం రాత్రి బిగ్ ట్విస్ట్.. ‘ఏనుగుతొండం ఘటికాచలం’ రివ్యూ..

Yenugu Thondam Ghatikachalam Movie Review

Updated On : November 13, 2025 / 12:39 PM IST

Yenugu Thondam Ghatikachalam Review : నరేష్, వర్షిణి, గిరిధర్, విజయభాస్కర్, ఇంటూరి వాసు, శ్రీకాంత్ అయ్యంగార్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరెక్కిన సినిమా ‘ఏనుగుతొండం ఘటికాచలం’. ఒకప్పుడు ఎన్నో డిఫరెంట్ సినిమాలతో మెప్పించిన రవిబాబు ఈ సినిమాని దర్శక నిర్మాతగా తెరకెక్కించాడు. ‘ఏనుగుతొండం ఘటికాచలం’ సినిమా నేడు నవంబర్ 13 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

కథ విషయానికొస్తే.. ఏనుగుతొండం ఘటికాచలం(నరేష్) రిటైర్ అయిపోయి చనిపోయిన భార్య జ్ఞాపకాలతో బతుకుతూ ఉంటాడు. ఇద్దరు కొడుకులు, కోడళ్ళు ఏ పనిచేయకుండా ఘటికాచలం పెన్షన్ తో బతుకుతూ ఉంటారు. పిల్లలు కనీసం తనని పట్టించుకోకపోవడంతో బాధపడుతున్న సమయంలో ఇంట్లో పనిచేసే పనిమనిషి భవాని(వర్షిణి) ఘటికాచలంకు దగ్గరవుతుంది. దీంతో ఘటికాచలం – భవాని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతారు.

ఇది కొడుకులు, కోడళ్ళకు నచ్చదు. ఘటికాచలం – భవాని పెళ్లి అయ్యాక భవాని కింద బతకాల్సి వస్తుందని ఘటికాచలం పేరు మీద ఒక ఇన్సూరెన్స్ చేసి ఆయన్ని చంపేసి, భవానిని ఇంట్లోంచి వెళ్ళగొడదాం అని ప్లాన్ వేస్తారు. కానీ ఘటికాచలం మొదటి రాత్రి శోభనం రోజే అనుకోకుండా చనిపోతాడు. ఆయన మరణంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఘటికాచలం చావుని కొడుకులు, కోడళ్ళు ఎలా ఉపయోగించుకున్నారు? ఘటికాచలం నిజంగానే చనిపోయాడా? భవాని ఎందుకు ముసలాయన్ని పెళ్లి చేసుకుంది? ఇన్సూరెన్స్ ప్లాన్ ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

Also Read : The Girlfriend Success Meet : రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ మీట్.. హాజరయిన బాయ్ ఫ్రెండ్.. ఫొటోలు వైరల్..

సినిమా విశ్లేషణ..

రవిబాబు డైరెక్షన్ సినిమాలు అంటే సరికొత్తగా ఉంటాయి, అందర్నీ మెప్పిస్తాయని తెలిసిందే. ఇటీవల ఆయన తీసిన కొన్ని సినిమాలు విజయం సాధించకపోయినా కొత్తగా ఉండి మెప్పించాయి. ఇప్పుడు కొంచెం గ్యాప్ తో ఈ ‘ఏనుగుతొండం ఘటికాచలం’ అనే సినిమాతో వచ్చాడు రవిబాబు. భార్య చనిపోయి పెద్ద వయసులో బాధపడుతున్న ముసలాయన్ని చంపేసి అతని పేరు మీద వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులను తీసుకోవాలని కొడుకులు – కోడళ్ళు చేసే ప్రయత్నంతో ఈ కథని రాసుకున్నారు.

అయితే ఇది చాలా సీరియస్, సెన్సిటివ్ పాయింట్ అయినా రవిబాబు తన స్టైల్ లో కామెడీ గా తెరకెక్కించాడు. స్టార్టింగ్ భార్య పోయింది అనే బాధ, పిల్లలు పట్టించుకోవట్లేదు అనే బాధలో కాస్త ఎమోషన్ చూపించి ఘటికాచలం మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన దగ్గర్నుంచి ఫుల్ గానే నవ్వించారు. ఇంటర్వెల్ కి ఆయన చనిపోతే ఏం చేసారు అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా ఆ శవం ఇంట్లో పెట్టుకొని ఇన్సూరెన్స్ కోసం, వచ్చిపోయేవాళ్లకు తెలియకుండా ఉండటానికి వీళ్ళు ఎలా కష్టపడ్డారు అని సస్పెన్స్ తో నవ్వించారు. ఆ సస్పెన్స్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. చివర్లో మాత్రం కొంచెం పేరెంట్స్ ఎమోషన్ వర్కౌట్ చేసారు దాంతో సినిమా ముగిస్తారేమో అనుకుంటాం కానీ మళ్ళీ ఓ ట్విస్ట్ ఇచ్చి సాగదీయడంతో ఎందుకు ఇలా అనిపిస్తుంది.

అయితే ఆ ట్విస్ట్ ముందే ఊహించొచ్చు. సెకండ్ హాఫ్ లో ఆ సస్పెన్స్ కామెడీ వర్కౌట్ అయినా అక్కడక్కడా కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. చివర్లో సెకండ్ పార్ట్ కి అధికారికంగా చెప్పకపోయినా లీడ్ ఇవ్వడం గమనార్హం. రవిబాబు సినిమాలు అంటే కొంత డబల్ మీనింగ్ డైలాగ్స్, రొమాన్స్ లాంటిది ఉండాల్సిందే. ఇందులో కూడా అక్కడక్కడా అవి ఉండేలానే చూసుకున్నారు. ఎంట్రీ టైటిల్స్ కూడా టైటిల్ కి తగ్గట్టు స్క్రీన్ మీద సీన్ తో కొత్తగా చూపించారు. ఇది థియేటరో కూడా రిలీజ్ చేయొచ్చు కానీ ఓటీటీకే పరిమితం చేసారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం జనాలు ఎలాంటి మోసాలు చేస్తున్నారు అని మరో కొత్త కోణం కామెడీగా చూపించాడు రవిబాబు. హ్యాపీగా కాసేపు నవ్వుకోడానికి ఈ సినిమా చూసేయొచ్చు.

Yenugu Thondam Ghatikachalam

నటీనటుల పర్ఫార్మెన్స్..

ఒకప్పటి హీరో, సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో ముసలాయన పాత్రలో, చనిపోయిన తర్వాత శవం పాత్రలో బాగా నటించారు. కామెడీ పండిస్తూనే చివర్లో ఎమోషన్ ని కూడా చూపించారు. యాంకర్ గా ఫేమ్ తెచ్చుకున్న వర్షిణి అప్పుడప్పుడు ఇలా నటిగా మారి అలరిస్తుంది. తన పనిమనిషి పాత్రకి తగ్గ నటనతో బాగా మెప్పించింది. శ్రీకాంత్ అయ్యంగార్ కూడా బాగానే నవ్వించారు. రవిబాబు, ఇంటూరి వాసు, జూనియర్ రేలంగి, గిరిబాబు, చిత్రం శీను, రఘుబాబు, అలీ, కృష్ణ భగవాన్, గీతా సింగ్.. పలువురు వారి వారి పాత్రల్లో బాగానే నటించి నవ్విచారు.

Also Read : Vijay Deverakonda : రష్.. నిన్ను చూసి గర్వపడుతున్నాను.. రష్మిక గురించి విజయ్ ఏం మాట్లాడాడో తెలుసా?

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ విషయంలో కొన్ని సీన్స్ లో షార్ప్ కట్స్ చేయాల్సింది. ఇన్సూరెన్స్ మోసాలు కథతో చాలా సినిమాలు వచ్చినా ఇందులో ఓ కొత్త పాయింట్ తీసుకొని సస్పెన్స్ కథాంశంతో బాగా రాసుకొని తెరకేక్కిన్చాడు రవిబాబు. ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే. నిర్మాణ పరంగా తక్కువ మంది ఆర్టిస్టులతోనే తక్కువ లొకేషన్స్ లో సింపుల్ గా ఈ సినిమాని చిన్న బడ్జెట్ లోనే తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇలాంటి సినిమాలు తీయడంలో రవిబాబుకి మంచి అనుభవం ఉన్న సంగతి తెలిసిందే.

మొత్తంగా ‘ఏనుగుతొండం ఘటికాచలం’ సినిమా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ ఫ్యామిలీ ఏం చేసింది అని కామెడీగా చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..