Producer SKN Interesting Comments on Pushpa Movie
Pushpa : అల్లు అర్జున్ పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా నార్త్ లో పుష్ప సినిమా బాగా ఆడింది. పుష్ప సాంగ్, డైలాగ్స్ కి అక్కడి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. డిసెంబర్ 6న పుష్ప 2 సినిమా రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే తాజాగా నిర్మాత SKN ఓ సినిమా ఈవెంట్లో పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ.. కోల్‍కతాలో ఒక మావోయిస్టు ప్రాంతం ఉంది. అక్కడ మామూలుగానే సెకండ్ షోలు పడవు. కానీ అలాంటి ఏరియాలో పుష్ప సినిమా 50 రోజులు ఆడిందని చెప్పడంతో నేను షాక్ అయ్యాను. పుష్ప రీచ్ ఈ రేంజ్ లో ఉందా అని అనుకున్నాను అంటూ తెలిపారు.
Also Read : Ananya Panday : ఈ హీరోయిన్ అందానికి కారణం కన్నీళ్లు అంట.. అందం కోసం ఏడ్చే హీరోయిన్..
అలాగే పుష్ప 2 సినిమాలో కొన్ని సీన్స్ చూసాను. అల్లు అర్జున్ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసి షాక్ అయ్యాను. అదిరిపోయాయి ఆ సీన్స్. నాకు కూడా పుష్ప 2 ఎప్పుడు చూస్తానా అని ఉంది. పుష్ప సినిమాతో తెలుగులో 70 ఏళ్ళ సినీ పరిశ్రమలో ఎవరూ సాధించలేని బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు సాధించారు బన్నీ. పుష్ప 2 తర్వాత అన్ని అవార్డులు ఆయనకే వస్తాయి అని అన్నారు SKN. దీంతో నిర్మాత SKN వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
కోలకతా లో ఒక ఏరియా లో అక్కడ సెకండ్ షో లు పడని ఒక మావోయిస్టు ఏరియా లో #PUSHPA Part 1 సినిమా 50 డేస్ Run అయింది అన్నారు .. షాక్ అయ్యాను అది విన్నాక #Pushpa pic.twitter.com/zE16CPcYof
— ScootyPep (@Bottlekaap) October 14, 2024
Peak #ALLUARJUN 🐲
Peak #SUKUMAR 🐲
Peak #DSP 🐲Thandavam on December 5th❤️🔥#SKN recently watched 2 scenes in #Pushpa2 and they are spellbounding💥💥#Pushpa2TheRuleOnDec5th #Pushpa2TheRule #RashmikaMandanna #DeviSriPrasad
pic.twitter.com/vOEkLOSeSC— Vishnu Writess (@VWritessss) October 14, 2024