Ananya Panday : ఈ హీరోయిన్ అందానికి కారణం కన్నీళ్లు అంట.. అందం కోసం ఏడ్చే హీరోయిన్..
తాజాగా అనన్య పాండే ఇటీవల ఇచ్చిన ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Ananya Panday wants to Cry for Increasing her Beauty
Ananya Panday : ఎవరైనా నవ్వితే బాగుంటారు అంటారు. కానీ ఈ హీరోయిన్ ఏడిస్తే బాగుంటాను అంటుంది. సాధారణంగా హీరోయిన్ అందంగా కనపడటానికి, తమ అందం అలాగే కొన్నేళ్ల పాటు కొనసాగడానికి ఏవేవో ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. కానీ ఈ హీరోయిన్ తన అందం పెరగడానికి కారణం కన్నీళ్లు అని చెప్తుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే చుంకీ పాండే కూతురుగా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతుంది. వరుస సినిమాలతో సందడి చేస్తుంది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో కూడా మెప్పించింది. తాజాగా అనన్య పాండే ఇటీవల ఇచ్చిన ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Also Read : Pranita Subhash : తన ఇద్దరు పిల్లలతో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్.. ప్రణీత ఇద్దరు పిల్లల్ని చూశారా?
అనన్య పాండే మాట్లాడుతూ.. నాకు ఏడుపు అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు నా సోషల్ మీడియాలో నేను ఏడ్చే ఫొటోలు కూడా పెడతాను. కన్నీటితో నిండిన కళ్ళు నాకు సహజమైన అందాన్ని, నా ముఖంలో మెరుపుని ఇస్తాయి. నేను మాములుగా ఉన్నప్పటి కంటే ఏడుస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ అందంగా ఉంటాను. చాలాసార్లు ఏడుస్తూ అద్దంలో చూసుకున్నాను. నేను సాధారణంగా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేను. నాకు ఆటోమేటిగ్గా కన్నీళ్లు వస్తాయి. ఆ కన్నీళ్లు నా అందాన్ని రెట్టింపు చేస్తాయి అని చెప్పింది.
అలాగే ఒక్కోసారి తన అందం పెరగడానికి కావాలని ఏడుస్తాను అని కూడా చెప్పింది. దీంతో అనన్య పాండే వ్యాఖ్యలు వైరల్ గా మారగా అందం కోసం ఏడవడం ఏంటో అని అనుకుంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.