Producer Swapna Dutt gives a stunning counter to the reporter
Swapna Dutt: టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్, స్వప్న మూవీ సంయుక్తంగా నిర్మించిన లేటెస్ట్ మూవీ ఛాంపియన్. రోషన్ మేక హీరోగా వచ్చిన ఈ పీరియాడికల్ డ్రామాలో మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. తెలంగాణలోని బైరాన్ పల్లి కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించాడు. విడుదలకు ముందే భారీ అంచనాల క్రియేట్ చేసిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల అయ్యింది. ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఛాంపియన్ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. అంతేకాదు, రిపోర్టర్ అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పుకొచ్చారు.
Kailash Kher: పశువుల్లా ప్రవర్తించకండి.. అభిమానులపై సింగర్ షాకింగ్ కామెంట్స్
ఈ నేపధ్యంలోనే ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నిర్మాత స్వప్న దత్(Swapna Dutt) అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సినిమా రన్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఏదైనా చెప్పడం చాలా ఈజీ చేయడం కష్టం. మేకర్స్ గా ఆ కథతో ఎంత కనెక్ట్ అవుతామో మాకు తెలుసు. అలా ఏది పడితే అది కట్ చేసుకుంటూ పోతే ఇక సినిమా ఎం ఉంటుంది. కొన్ని సీన్స్ మాత్రమే ఉంటాయి. ఇదే సినిమా మేము కాకుండా వేరేవాళ్లు చేసుంటే అద్భుతం అనేవారు. ఇలాంటి రివ్యూలు ఇచ్చేవారు కాదు. ముందు నుంచే మాకు కష్టమైన సినిమాలు చేయడం నచుతుంది అంటూ చెప్పుకొచ్చారు. దీంతో, నిర్మాత స్వప్న దత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఇదే ప్రెస్ మీట్ లో తమ నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడిన స్వప్న దత్.. ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2 గురించి చెప్పారు. తమ బ్యానర్ లో వచ్చే నెక్స్ట్ సినిమా కల్కి 2 అని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.