Kailash Kher: పశువుల్లా ప్రవర్తించకండి.. అభిమానులపై సింగర్ షాకింగ్ కామెంట్స్
సింగర్ కైలాష్ ఖేర్(Kailash Kher) అభిమానులను ఉద్దేశించి కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. పశువుల్లా ప్రవర్తించకండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Singer Kailash Kher made shocking comments about his fans
Kailash Kher: స్టార్ సింగర్ కైలాష్ ఖేర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన టిపికల్ గొంతుతో ఎన్నో అద్భుతమైన పాటలను అయన పాడారు. అరుంధతి సినిమాలో జేజమ్మ సాంగ్, మిర్చి సినిమాలో పండగలా సాంగ్, భరత్ అనే నేను సినిమాలో వచ్చాడయ్యో సామీ సాంగ్, చిత్ర లహరి సినిమాలో ప్రయత్నమే తొలి విజయం లాంటి అనేక హిట్స్ సాంగ్ ఆయన పాడారు. అలాగే రీసెంట్ గా విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ 2లో కూడా అఖండ తాండవం అనే పవర్ ఫుల్ పాటను పాడారు కైలాష్ ఖేర్(Kailash Kher).
Samantha: ఇదొక అద్భుతమైన సంవత్సరం.. 2025 స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన సామ్
తాజాగా ఈ సింగర్ మ్యూజికల్ కాన్సర్ట్ గ్వాలియర్‌లో జరిగింది. ఈ కాన్సర్ట్ కి ఆడియన్స్ నుంచి చాలా డిమాండ్ ఏర్పడింది. అభిమానులు కూడా చాలానే వచ్చారు. దీంతో, ఆ షోలో గందరగోళం ఏర్పడింది. అభిమానుల ప్రవర్తనకు సహనం కోల్పోయిన సింగర్ కైలాష్ ఖేర్ అభిమానులను ఉద్దేశించి కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు..”పశువుల్లా ప్రవర్తించకండి. ఇలా ప్రవర్తించడం కరక్ట్ కాదు. ఎవరైనా మా సంగీత పరికరాల వద్దకు వస్తే షోని నిలిపివేయాల్సి వస్తుంది” అంటూ హెచ్చరించాడు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే తీవ్రమైన ట్రోలింగ్ కూడా జరుగుతుంది ఆయన చేసిన కామెంట్స్ పై. అభిమానులను పశువులు అనడం ఏంటి అని కొంతమంది నెటిజన్స్ మండిపడుతున్నారు. మరి ఈ కామెంట్స్ పై కైలాష్ ఖేర్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.
