The RajaSaab : రాజాసాబ్ ఫెయిల్యూర్ పై స్పందించిన నిర్మాత.. అలా చేయకుండా ఉండాల్సింది..

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడగా రాజాసాబ్ ఫెయిల్యూర్ గురించి ప్రశ్న ఎదురవడంతో టిజి విశ్వప్రసాద్ స్పందించారు. (The RajaSaab)

  • Updated on- October 13, 2026 / 06:02 PM IST

The RajaSaab

The RajaSaab : ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయింది. ప్రభాస్ మొదటి సారి హారర్ కామెడీ చేస్తుండటంతో ముందు నుంచి ఆ సినిమాపై హైప్ నెలకొంది. పలుమార్లు వాయిదాపడి 2026 సంక్రాంతికి జనవరి 9న రిలీజయింది. అయితే ప్రీమియర్స్ నుంచే రాజాసాబ్ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. గ్రాఫిక్స్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. కమర్షియల్ గా చివరకు ఫెయిల్యూర్ గానే మిగిలింది రాజాసాబ్.

రాజాసాబ్ సినిమా నిర్మాత టిజి విశ్వప్రసాద్ గరివిడి లక్ష్మి సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడగా రాజాసాబ్ ఫెయిల్యూర్ గురించి ప్రశ్న ఎదురవడంతో టిజి విశ్వప్రసాద్ స్పందించారు.

Also Read : Jayammu Nischayammu Raa : జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా.. సెకండ్ సీజన్.. సాయి పల్లవితో మొదలు.. ప్రోమో చూశారా?

టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. రాజాసాబ్ వచ్చిన సీజన్ కరెక్ట్ కాదు. ఫెస్టివల్ సీజన్ లో వచ్చింది. ఆ జానర్ కి వేరే ఏ సమయంలో వచ్చినా ఆ సినిమా హిట్ అయ్యేది. రాజాసాబ్ బెస్ట్ రిలీజ్ చేసాము. సీజన్ లో రావడం వల్ల థియేటర్స్ కొన్ని తగ్గాయి. రిలీజ్ చేసే సమయంలో ప్రీమియర్స్ ఆలస్యం అవ్వడం, టికెట్ రేట్లు పెంచడం వల్ల ఎఫెక్ట్ అయింది. మేము మొదటిసారి టికెట్ రేట్లు ఆ సినిమాకే పెంచాము. అది చేయకుండా ఉండాల్సింది. వీటన్నిటివల్ల చాలా మంది ఫ్రస్టేట్ అవ్వడం.. ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి ఆ సినిమా ఫెయిల్యూర్ అవ్వడానికి అని తెలిపారు. మరి దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి.