Producer Vijay comments on Salaar Movie
Producer Vijay : ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత సినిమా రాధేశ్యామ్ నిరాశపరచడంతో, ఆదిపురుష్ కూడా లేట్ అవుతుండటంతో ప్రభాస్ అభిమానులు సలార్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. KGF లాంటి బ్లాక్ బస్టర్ సీనేమీ తీసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా KGF నిర్మాతలే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
తాజాగా సలార్ నిర్మాత విజయ్ కిరంగదుర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సలార్ సినిమా గురించి మాట్లాడాడు. విజయ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ జరుగుతుంది. దాదాపు 85 శాతం షూటింగ్ ఆయిపోయింది. జనవరి చివరికల్లా సలార్ సినిమా షూట్ పూర్తి చేస్తాం. VFX కి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. సినిమా మాత్రం చెప్పిన టైంకి రిలీజ్ చేస్తాం. ఈ సినిమా తర్వాత సలార్ పార్ట్ 2 గురించి ఆలోచిస్తాం అని అన్నారు.
Nagababu : చిరంజీవి మీద కానీ, ఆయన ఫ్యామిలీ మీద కానీ ఈగ వాలినా ఊరుకోము..
సలార్ సినిమాపై ఇలా అప్డేట్ ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాని 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రభాస్ అభిమానులు సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.