Dhruv Vikram : విక్రమ్ కొడుకుపై ఫిర్యాదు.. కోటి రూపాయలు తీసుకొని సినిమా చేయకుండా..

అతనిపై తమిళ్ ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. (Dhruv Vikram)

  • Published on- July 24, 2026 / 05:35 PM IST

Dhruv Vikram

Dhruv Vikram : తమిళ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు ధృవ్ విక్రమ్. ఓ మూడు సినిమాలతో పర్వాలేదనిపించాడు. ఇటీవలే బైసన్ అనే సినిమాతో వచ్చాడు. ఇప్పటికే పలు వివాదాల్లో, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో లవ్ స్టోరీ అంటూ వార్తల్లో నిలిచాడు ధృవ్ విక్రమ్. అయితే తాజాగా ఓ సినిమా పూర్తిచేయకుండానే మధ్యలో వదిలేసి ఇంకో సినిమా చేస్తున్నాడని అతనిపై తమిళ్ ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదులు నమోదు అయ్యాయి.

నీలాద్రి ప్రొడ‌క్ష‌న్, పెన్‌ స్టూడియోస్ బ్యానర్స్ పై రమేష్ వర్మ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ ఓ సినిమా మొదలుపెట్టారు. ఈ మేర‌కు ధృవ్ కి కోటి రూపాయ‌ల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ కోసం కూడా భారీగా ఖ‌ర్చు పెట్టారు. అయితే త్వ‌ర‌లో షూటింగ్ అన‌గా ధృవ్ విక్రమ్ మైత్రీ మూవీ మేకర్స్ తో సినిమా ప్రకటించాడు.

Also Read : Nara Rohith : మొదటిసారి హారర్ సినిమా చేస్తున్న నారా రోహిత్.. కొత్త సినిమా అనౌన్స్..

ర‌మేష్ వ‌ర్మ‌తో సినిమా అయ్యాకే మైత్రీ మూవీస్ సినిమా చేయాలి. దీనిపై ధృవ్ ని అడిగితే ర‌క‌ర‌కాల కార‌ణాలు చెప్తున్నాడని, మైత్రి వాళ్ళ సినిమా అయ్యాక చేస్తాను అంటున్నాడని, దానివల్ల వడ్డీల భారం పెరిగిపోతుంది అని, అసలు హీరో మాకు చెప్పకుండా మ‌రో నిర్మాత‌తో ఎలా సినిమా మొదలుపెట్టేస్తారు, ఇది మోసం చేసినట్టే అని నీలాద్రి ప్రొడ‌క్ష‌న్ త‌మిళ‌ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో ఈ హీరోపై ఫిర్యాదు చేశారు. మరి దీనిపై ఫిలిం ఛాంబర్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

గతంలో కూడా ధృవ్ విక్రమ్ కెరీర్లో మురుగ‌దాస్‌, మ‌ణిర‌త్నం సినిమాలు మొదలయి ఆగిపోయాయి. దీంతో ధృవ్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అసలు కెరీర్ మొదలు కాకముందే సొంత తప్పిదాలతో కెరీర్ క్లోజ్ చేసుకుంటున్నాడు ధృవ్ విక్రమ్.

Also Read : Hyper Aadi : ‘జన నాయగన్’ రిలీజ్ వేళ.. విజయ్, త్రిషపై హైపర్ ఆది కామెంట్స్..

ఇక ఇటీవలే అనుపమ పరమేశ్వరన్ ధృవ్ విక్రమ్ కి బ్రేకప్ చెప్పింది. ఈ విషయన్ని ఇండైరెక్ట్ గా తన సోషల్ మీడియాలో ధృవ్ పేరు ప్రస్తావించకుండా ఆరోపణలు చేస్తూ పోస్ట్ చేసింది. ఇలా ఓ వైపు లవ్ ఫెయిల్యూర్, మరో వైపు సినిమాలు వివాదం, మరో వైపు హిట్స్ లేవు.. మరి ధృవ్ విక్రమ్ వీటికి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.