Producers Guild: ఆగస్టు 1 నుండి షూటింగ్స్ బంద్.. అఫీషియల్‌గా ప్రకటించిన ప్రొడ్యూసర్స్ గిల్డ్

గతకొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న అయోమయ పరిస్థితుల కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు నిర్మాతలు చెబుతూ వస్తున్నారు. తాజాగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశంలో ఆగస్టు 1 నుండి అన్ని రకాల సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకుంది.

Producers Guild: గతకొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న అయోమయ పరిస్థితుల కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు నిర్మాతలు చెబుతూ వస్తున్నారు. కరోనా పాండెమిక్ తరువాత తమ సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తిని చూపడం లేదని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశంలో 21 మంది సభ్యులు పాల్గొని ఓ నిర్ణయం తీసుకున్నారు.

యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం ప్రకారం టాలీవుడ్‌లో ఆగస్టు 1 నుండి అన్ని రకాల సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని.. త్వరలోనే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే తమ నిర్ణయాన్ని ఇండస్ట్రీలోని ఇతర నిర్మాతలు కూడా అంగీకరిస్తారని గిల్డ్‌లోని సభ్యులు ఆశిస్తున్నారు.

ఇలా సడెన్‌గా షూటింగ్స్ బంద్ చేయడం ఏమాత్రం సబబు కాదని.. ఇలా సినిమా షూటింగ్స్ బంద్ చేయడంతో సినీ కార్మికులు తీవ్ర కష్టాలు పడుతారని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా షూటింగ్స్ బంద్ నిర్ణయంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు