Producers Strong Action On Fake Movie Reviews
Fake Movie Reviews : ఓ సినిమా తీయాలంటే రెండేళ్లు పట్టొచ్చు. రెండు మూడు నెలల్లో కూడా మూవీ తీయొచ్చు. కానీ పిక్చర్ సక్సెస్ ఫెయిల్యూర్‌ను డిసైడ్ చేసేది ఆ రెండు రోజులే. అయితే.. రిలీజ్ కంటే ముందే రివ్యూస్.. మూవీ సక్సెస్, ఫ్లాఫ్‌ను డిసైడ్ చేస్తున్నాయి. కొన్ని సినిమాలపై అయితే విడదల కంటే ముందు రివ్యూస్ చక్కర్లు కొడుతుంటాయి. దీంతో దెబ్బకు అట్టర్ ఫ్లాప్‌లుగా నిలుస్తున్నాయట కొన్ని మూవీస్.
అందుకే ఫేక్ రివ్యూలు, రేటింగ్‌లకు అడ్డుకట్ట వేసే పనిలో పడ్డారట నిర్మాతలు. టాలీవుడ్‌లో ఇటీవలి కొన్ని బిగ్ బడ్జెట్ సినిమాల రిలీజ్‌కు ముందు ప్రముఖ యాక్టర్లు, ప్రొడ్యూసర్లు కోర్టుకెళ్లి ఇన్‌జంక్షన్ ఆర్డర్లు, ప్రివెంటివ్ లీగల్ ఆర్డర్లు తెచ్చుకున్నారట. దీంతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్‌కు ముందు, రిలీజ్ తర్వాత తమ సినిమాలపై నెగెటివ్ రివ్యూస్, ఫేక్ రేటింగ్స్ రాకుండా చెక్ పెట్టగలిగారట.
సోషల్ మీడియాలో ట్రోలింగ్ గ్యాంగ్స్, ఫ్యాన్స్ ఫేక్ రేటింగ్స్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను ప్రభావితం చేస్తున్నాయి. రీసెంట్ బ్లాక్‌బస్టర్‌లో ఇలాంటి ఇష్యూస్‌తో ప్రొడ్యూసర్లు లాస్ అయ్యారని చెబుతున్నారు. కాబట్టి రిలీజ్ ముందు కోర్టు ఆర్డర్ తీసుకుని, తమ అనుమతి లేకుండా ఏ కంటెంట్ వాడినా డిఫమేషన్ సూట్ వేస్తామని, లీగల్ యాక్షన్ తీసుకుంటామని స్పెసిఫై చేస్తున్నారట.
దీంతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌కు ఓ ఝలక్ ఇచ్చినట్లు అవుతుందట. గతేడాది కనీసం 3-4 పెద్ద సినిమాలకు కోర్టుల నుంచి ఇలాంటి ఆర్డర్స్ తెచ్చుకుని ఫేక్ రివ్యూస్, రేటింగ్స్‌కు బ్రేక్ వేయగలిగారట. ఫ్యూచర్‌లో ఇది స్టాండర్డ్ ప్రాక్టీస్ అవుతుందని టాక్. ఇక మార్చిలో రిలీజ్ అయ్యే పెద్ది సినిమాకు కూడా ఇలాంటి ఆర్డర్ తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది.