×
Ad

Kalki 2898 AD : కల్కి సినిమాలో ఇద్దరు విలన్లు.. రానా కూడా ఉన్నాడా? కామిక్ కాన్ స్టేజిపై నాగ్ అశ్విన్, కమల్ రివీల్..

కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K టీంని స్టేజిపైకి వెళ్ళినప్పుడు మొదట రానా వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత రానా మిగిలిన టీంని పిలిచాడు. ప్రభాస్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి నా ఫ్రెండ్ అంటూ పరిచయం చేసి ప్రభాస్ ని స్టేజిపైకి పిలిచాడు రానా.

  • Published On : July 21, 2023 / 12:44 PM IST

Project K Kalki 2898 AD Movie has 2 villains including Kamal Haasan Nag Ashwin Revealed on Comic Con Stage

Kalki 2898 AD :  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా చాలామంది స్టార్స్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ K సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ కార్యక్రమానికి దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్, రానా పాల్గొన్నారు.

సినిమాకు కల్కి అనే టైటిల్ ని ప్రకటించారు. సినిమా టైటిల్ కింద 2898 AD అని పెట్టారు. కలియుగాంతంలో జరిగే కథ అని తెలుస్తుంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. దీంతో ఒక్కసారిగా ప్రాజెక్ట్ K సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K టీంని స్టేజిపైకి వెళ్ళినప్పుడు మొదట రానా వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత రానా మిగిలిన టీంని పిలిచాడు. ప్రభాస్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి నా ఫ్రెండ్ అంటూ పరిచయం చేసి ప్రభాస్ ని స్టేజిపైకి పిలిచాడు రానా. ఇక ప్రాజెక్ట్ K టీం స్టేజి మీదకు వచ్చేముందు మన ఇండియన్ కల్చర్ లో ఆహ్వానం పలికారు. మేళతాళాలతో కొంతమంది స్టేజి మీద ప్రదర్శన ఇస్తుంటే, కొంతమంది మహిళలు దీపాలతో స్టేజిపైకి వచ్చి ఆహ్వానం పలికారు.

Project K Movie Team : కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ K టీం ఫోటోలు..

కామిక్ కాన్ స్టేజిపై కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఇద్దరు విలన్లు ఉన్నారు. ఒకటి నేను, ఇంకొకరు ఎవరో నాకు కూడా తెలీదు అని చెప్పారు. ఇక ఆడియన్స్ డైరెక్టర్ ని సినిమాలో రానా ఉన్నాడా అని అడిగితే అది మీరు సినిమా మొదటి రోజు చూసి సర్ ప్రైజ్ అవ్వండి అని చెప్పాడు నాగ్ అశ్విన్. దీంతో ఈ సినిమాలో రానా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకో విలన్ క్యారెక్టర్ రానానే పోషిస్తున్నట్టు పలువురు భావిస్తున్నారు. ప్రాజెక్ట్ K టీంతో పాటు మొదటి నుంచి కూడా రానా అమెరికా వెళ్లిన దగ్గర్నుంచి కామిక్ కాన్ ఈవెంట్ వరకు కూడా ఉన్నాడు. అయితే రానా తన స్పిరిటి మీడియా కామిక్ సిరీస్ లను ప్రమోట్ చేసుకోవడానికి వెళ్లారనుకున్నారు అంతా. నాగ్ అశ్విన్, కమల్ హాసన్ ఇచ్చిన హింట్స్ తో రానా కూడా ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో మరోసారి బాహుబలి , భల్లాలదేవా యుద్ధం చూడొచ్చు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమా రిలీజ్ అయ్యేదాకా సెకండ్ విలన్ ఎవరో, రానా సినిమాలో ఉన్నాడా లేదా అని క్లారిటీ రాదేమో.