Punarnavi Bhupalam effected with chest health issues
Punarnavi Bhupalam : ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ తో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది పునర్నవి. మొదటి సినిమాతోనే మెప్పించినా ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. అవకాశాలు రాకపోయినా బాధపడకుండా ఓ పక్క చదువుకుంటూనే తనకి వచ్చిన అడపాదడపా ఛాన్స్ లని వదులుకోకుండా నటించింది. ఉయ్యాల జంపాల, మళ్లీమళ్లీ ఇది రానిరోజు, పిట్టగోడ, మనసుకు నచ్చింది సినిమాలతో పాటు మరికొన్ని చిన్న సినిమాల్లో కూడా నటించింది. 2018 తర్వాత కొన్ని రోజులకే ఫేడ్ అవుట్ అయిపొయింది పునర్నవి.
కానీ 2019లో బిగ్ బాస్ లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకొని కంబ్యాక్ ఇచ్చింది. ఈ షోతో సోషల్ మీడియాలో పునర్నవి బాగానే ఫేమస్ అయింది. షో తర్వాత తనకి పలు అవకాశాలు కూడా వచ్చాయి. కమిట్ మెంటల్ అనే సిరీస్ లో కూడా నటించింది. పలు టీవీ షోలలో కూడా కనిపించింది. కానీ వరుస అవకాశాలు వస్తున్న సమయంలో లండన్ వెళ్ళి చదువుకుంటుంది. సైకాలజీలో మాస్టర్స్ చేయడానికి లండన్ వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్లినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది.
Peddada Murthi : టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ పాటల రచయిత కన్నుమూత..
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన హెల్త్ గురించి పోస్ట్ చేసి కొత్త సంవత్సరంలో అందరికి షాకిచ్చింది పునర్నవి. తన ఫోటోలని పోస్ట్ చేసి.. గత కొన్ని రోజులుగా నేను ఛాతికి సంబంధించిన ఓ అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఇలా అనారోగ్యంతో ఎక్కువ రోజులుగా బాధపడటం ఇదే మొదటిసారి. ఇదే చివరిసారి కావాలని కోరుకుంటున్నాను అని తెలిపింది. ఇప్పటికి అనారోగ్యంగానే ఉన్నాను కానీ కోలుకుంటాను, ఫైట్ చేస్తాను. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. నా మీద మీరు చూపించే ప్రేమకి చాలా థ్యాంక్స్ అని తెలిపింది. దీంతో పునర్నవి త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు, నెటిజన్లు కోరుకుంటున్నారు.