Puneeth Rajkumar : త్వరలో పునీత్ బయోపిక్.. నా శక్తి మేరకు ట్రై చేస్తానంటూ దర్శకుడు ప్రకటన

ఇంత గొప్ప వ్యక్తి గురించి ఆయన బయోపిక్ ను వెండితెరపైకి తీసుకురావాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో......

  • Published On : November 23, 2021 / 01:04 PM IST

Puneeth

 

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్ పునీత్ మరణం దేశ వ్యాప్తంగా అందర్నీ కలవర పెట్టింది. ఆయన అభిమానులు, కన్నడ ప్రజలు ఆయన మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. నేటికీ పునీత్ సమాధిని దర్శించుకోవడానికి వేలల్లో జనాలు వస్తున్నారు. కర్ణాటకలో రోజూ ఏదో ఒక చోట పునీత్ సంస్మరణ సభ చేపడుతున్నారు. ఆయన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలతో, మంచి పనులతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఇంత గొప్ప వ్యక్తి గురించి ఆయన బయోపిక్ ను వెండితెరపైకి తీసుకురావాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Pooja Hegde : నా కల నెరవేరింది : పూజ హెగ్డే

పునీత్ రాజ్ కుమార్ తో కన్నడ డైరెక్టర్ సంతోష్ ఆనంద్ రెండు సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘రాజకుమార’, ‘యువరత్న’ భారీ విజయం సాధించాయి. తాజాగా సంతోష్ ట్విట్టర్లో పునీత్ కి సంబంధించి ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశారు. ఇందులో పునీత్ అభిమానులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు.

Bigg Boss 5 : బిగ్‌బాస్ 5 హోస్ట్‌గా శృతి హాసన్?

ఓ అభిమాని.. ”సంతోష్ గారు మీరు పునీత్ రాజ్ కుమార్ గారి బయోపిక్ తియ్యండి, మీరు మాత్రమే ఆ సినిమాకు సరైన న్యాయం చేయగలరు” అంటూ కోరడంతో అందుకు డైరెక్టర్ సంతోష్ సమాధానంగా.. ”తప్పకుండా నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తాను, అలాంటి మంచి కథను తెర పైకి తీసుకు రావడం మంచి ఐడియా” అని అన్నారు. మరి నిజంగానే సంతోష్ పునీత్ బయోపిక్ తీస్తారా? తీస్తే ఎప్పుడు తీస్తారు? పునీత్ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా? ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అభిమానులు.