Puneeth Rajkumar : పునీత్ కలని నేను నెరవేరుస్తాను

పునీత్ కి ఒక కల నెరవేరకుండానే చనిపోయాడని, ఆ కలని నేను నెరవేరుస్తానని పునీత్ మేనల్లుడు గోపాల్ ఇటీవల తెలిపాడు. తన పూర్వీకులు, తన తండ్రి, సూపర్‌స్టార్‌ రాజ్‌కుమార్‌........

Puneeth Rajkumar : పునీత్ కలని నేను నెరవేరుస్తాను

Puneeth

Updated On : December 15, 2021 / 1:54 PM IST

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్‌, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని ఇన్ని రోజులైనా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు, సన్నిహితులు, అభిమానులు, కన్నడ ప్రజలు ఇప్పటికీ రోజూ పునీత్ ని తలుచుకుంటూనే ఉంటున్నారు. కర్ణాటకలో నేటికీ ఏదో ఒక చోట పునీత్ కి నివాళులు అర్పిస్తున్నారు. అయితే పునీత్ కి ఒక కల నెరవేరకుండానే చనిపోయాడని, ఆ కలని నేను నెరవేరుస్తానని పునీత్ మేనల్లుడు గోపాల్ ఇటీవల తెలిపాడు.

తన పూర్వీకులు, తన తండ్రి, సూపర్‌స్టార్‌ రాజ్‌కుమార్‌ స్వస్థలమైన గాజనూర్‌లోని వారు నివసించిన ఇంటిని మ్యూజియంగా మార్చాలని పునీత్ అనుకున్నాడట. ఇప్పటికే శిథిలావస్ధకు చేరుకున్న ఆ ఇంటిని బాగు చేయించి అందమైన మ్యూజియంగా మార్చాలని, అందులో తన తండ్రికి సంబంధించిన జ్ఞాపకాలను పెట్టాలని అనుకున్నారట పునీత్.

Rashmika Mandanna : షార్ట్ నిక్కర్‌లో ‘సామి.. సామి..’ అంటున్న రష్మిక.. ఇది కూడా ప్రమోషన్స్‌లో భాగమే..

దీనికోసం పునీత్‌ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కూడా ఆ ఇంటిని చూసి మ్యూజియం ఏర్పాటుకు ప్రణాళికలు వేయించారట. కానీ దురదృష్టవశాత్తూ పునీత్‌ మరణించారు. అయితే పునీత్ కలని నిజం చేయడానికి ఆయన మేనల్లుడు గోపాల్‌ సిద్దమయ్యాడు. ఇప్పుడు ఆ ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు శరవేగంగా పనులు ప్రారంభించాడు. మరో రెండు నెలల్లో రెన్నోవేషన్‌ పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత పునీత్ జ్ఞాపకాలతో పాటు ఆయన తండ్రి రాజ్ కుమార్ జ్ఞాపకాలని కూడా ఇక్కడ భద్రపరుస్తానని తెలిపారు.