Puneeth Rajkumar : పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు గుండెపోటు.. అభిమానుల్లో ఆందోళన..

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు గుండెపోటు గురయ్యారు..

Puneeth Rajkumar

Puneeth Rajkumar: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయణ్ణి బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఈ ఉదయం ఇంట్లో జిమ్ చేస్తుండగా హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

కన్నడ కంఠీరవ, దివంగత రాజ్ కుమార్ మూడో కొడుకే పునీత్ రాజ్ కుమార్. పెద్దన్నయ్య శివ రాజ్ కుమార్ కన్నడలో సూపర్‌స్టార్. రెండో అన్నయ్య రాఘవేంద్ర రాజ్ కుమార్ నిర్మాతగా కొనసాగుతున్నారు.

 

పునీత్ రాజ్ కుమార్‌కు గుండెపోటు.. అనే వార్త వినగానే శాండల్‌వుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన సీనీ ప్రముఖులు పునీత్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

ఇక పునీత్ చికిత్స పొందుతున్న విక్రమ్ హాస్పిటల్ దగ్గరకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుంటున్నారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.