Puri Jagannadh: పూరి కూతురు హీరోయిన్.. ఆకాష్ ఏం చెప్పాడంటే?
ఏ పరిశ్రమలో అయినా వారసురాలు రావడం చాలా కామన్. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఇప్పటికే మూడు తరాలు ఇలా ఏలేస్తున్నారు. అందులో కూడా నటీనటుల వారసులే ఎక్కువగా నటనావైపు వస్తుంటారు.
- Naresh Mannam
- Published On : October 28, 2021 / 05:00 PM IST
Puri Jagannadh (1)
Puri Jagannadh: ఏ పరిశ్రమలో అయినా వారసురాలు రావడం చాలా కామన్. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఇప్పటికే మూడు తరాలు ఇలా ఏలేస్తున్నారు. అందులో కూడా నటీనటుల వారసులే ఎక్కువగా నటనావైపు వస్తుంటారు. స్టార్ హీరోల నుండి దర్శక, నిర్మాతల కుమారులు ఎక్కువగా నటులుగా మారుతుంటారు. కుమార్తెలు మాత్రం వెండితెరకి దూరంగానే ఉంటున్నారు. దక్షణాదితో పోలిస్తే బాలీవుడ్ లో వారసురాళ్లు కూడా సినీ పరిశ్రమను దున్నేస్తున్నారు. కానీ.. మన తెలుగులో మాత్రం వారసురాళ్లు ఎంట్రీ చాలా అరుదుగా కనిపిస్తుంది.
Radhe Shyam: అభిమానులకు మరో ట్రీట్.. దీపావళికి ముహూర్తం
మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ, రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక, సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల, నాగబాబు కూతురు నిహారిక లాంటి వారసురాళ్లు వచ్చినా వాళ్ళు పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు. కాగా, ఇప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరీజగన్నాధ్ కుమార్తె పవిత్ర టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పూరి కొడుకు ఆకాష్ హీరోగా మారి వరసగా సినిమాలు చేస్తుండగా త్వరలోనే ఆకాష్ రొమాంటిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Samantha: పిల్లల్ని ఎలా పెంచాలో పేరెంట్స్‌కి సలహాలిస్తున్న సామ్!
రొఇమాంటిక్ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న ఆకాష్ చెల్లి పవిత్ర ఎంట్రీపై స్పందించాడు. పవిత్ర ఎంట్రీ అంతా ఫేక్ అని ఆకాష్ కొట్టిపారేశాడు. తనకు నటన అంటే అసలు ఇష్టం ఉండదన్న ఆకాష్ చిన్నప్పుడు బుజ్జిగాడులో నాన్న బలవంతం మీద నటించిందని చెప్పాడు. అయితే.. పవిత్ర భవిష్యత్ లో నటించకపోయినా ఇండస్ట్రీలో ఉంటుందని.. తనకి ప్రొడక్షన్ అంటే చాలా ఇష్టమని.. అందుకే తాను నిర్మాతగా మారాలని కోరుకుంటుందని చెప్పాడు. అంటే.. త్వరలో పూరి బ్యానర్స్ లో పవిత్ర సినిమాలు నిర్మించడం ఖాయమనిపిస్తుంది.
