Pushpa: పుష్పను బాయ్‌కాట్ చెయ్యాలంటూ ట్రెండింగ్.. రీజన్ ఇదే!

ఐకాన్ స్టార్‌ అల‍్లు అర్జున్ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'పుష్ప: ది రైజ్'.

Pushpa

Pushpa: ఐకాన్ స్టార్‌ అల‍్లు అర్జున్ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘పుష్ప: ది రైజ్’. అఖండ సినిమా ఇచ్చిన జోష్‌తో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే పుష్ప టీమ్‌కు అభిమానుల నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

తమ భాషను అవమానించారంటూ కన్నడీగులు #BoycottPushpaInKarnataka అంటూ ట్రెండింగ్ చేశారు. పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా కర్నాటకలో కూడా రిలీజ్ అవుతోంది. అయితే, కర్నాటకలో కన్నడ భాషలో కంటే, తెలుగు భాషలోనే ఎక్కువగా రిలీజ్ అవుతోంది. ఈ కారణంగా అక్కడి భాషాభిమానులు నొచ్చుకున్నారు.

కర్నాటకలో ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ కంటే తెలుగులోనే ఎక్కువ థియేటర్స్‌లో విడుదలవుతోంది. ఈ క్రమంలోనే అక్కడి అభిమానులు బాయ్ కాట్ పుష్ప అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కగా.. ‘పుష్ప’ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌గా కనిపించబోతున్నారు. రష్మిక మందన్నా పల్లెటూరి యువతి పాత్రలో నటించింది. స్టార్‌ హీరోయిన్‌ సమంత స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్పులేసింది.