Pushpa 2
Pushpa : సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ సినిమా కొన్ని చోట్ల మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా మంచి విజయం సాధించి కలెక్షన్స్ పరంగా బాగానే వసూళ్లు రాబడుతుంది. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షోగా ఈ సినిమాని నడిపించాడు. ఈ సినిమాని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ముందే చెప్పారు. ఇప్పుడు ‘పుష్ప ది రైజ్’ అనే పేరుతో పార్ట్ 1 మాత్రమే విడుదల చేశారు. ‘పుష్ప ది రూల్’ అనే పేరుతో పార్ట్ 2 తర్వాత రిలీజ్ చేయనున్నారు.
అయితే ఈ సినిమాలో కొని సన్నివేశాలని సాగదీశారని, క్యారెక్టర్స్ ని పూర్తిగా వాడుకోలేదని, క్లైమాక్స్ కూడా అసంపూర్ణంగా వదిలేశారని, ఫాహిద్ ఫాజిల్ ని సరిగ్గా వాడుకోలేదని, పుష్ప క్యారెక్టర్ ని కూడా పూర్తిగా రివీల్ చేయలేదని సినిమా చూసిన వాళ్ళు చెప్తున్నారు. అయితే నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో సుకుమార్ ‘పుష్ప’ అసలు కథ పార్ట్-2లోనే ఉంది. పార్ట్-1 అసలు కథకి ఒక లీడ్ మాత్రమే. పార్ట్ 2 మరో లెవల్లో ఉంటుంది అని అన్నారు. దీంతో పార్ట్ 2 కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
Pushpa : అసలు మజా పార్ట్ 2లో ఉంది : సుకుమార్
‘పుష్ప’ పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడు ఉంటుంది? సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటికి కూడా సుకుమార్ సమాధానమిచ్చాడు. ఇప్పటికే ‘పుష్ప’ పార్ట్ 2 షూటింగ్ 10 శాతం పూర్తి అయిందని, మొదటి పార్ట్ చేసేటప్పుడే కొన్ని సన్నివేశాలని చిత్రీకరించామని తెలిపారు. ఇక మిగిలిన షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు అవ్వనుందని తెలిపారు. కరోనా వల్ల లేట్ అవ్వకుండా పరిస్థితులు అన్ని బాగుంటే మళ్ళీ వచ్చే ఏడాది ఇదే సమయానికి పుష్ప పార్ట్ 2 రిలీజ్ చేస్తామని సుకుమార్ తెలిపారు. దీంతో మరోసారి వచ్చే ఏడాది డిసెంబర్ లో అల్లు అర్జున్ హంగామా చేయబోతున్నాడని తెలుస్తుంది.