ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ‘అమృత భూమి’ సినిమాలో కనిపించనున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 23, 2019)న ఆమె సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమాలో ఆమె టీచర్ పాత్రలో నటించనున్నరు. అయితే నిన్న ఆమె విద్యార్థులకు విత్తనాలు నిల్వ చేసే విధానంపై మాట్లాడుతున్న సీన్ ను షూట్ చేశారు. ఈమెతో పాటు సినీనటుడు ప్రసాద్ బాబు, బుల్లితెర నటులు ఉదరుకుమార్, తదితరులు షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ షూటింగ్‌లో జట్టు అధినేత డి.పారినాయుడు, వైసీపీ నాయకులు గిరిబాబు, ఎ.ఇందిరా కుమారి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ… ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, రైతులు బాగుకోరే ప్రకృతి వ్యవసాయంపై సినిమా నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి సినిమాలో నేను నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు.
రాజాప్రసాద్ బాబు మాట్లాడుతూ… రోజు రోజుకీ అటవీప్రాంతం అంతరించి పోతోంది. తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్టల వరకు అంతా రసాయనాలతో తయారు చేస్తున్నారు అందుకే రైతులకు ప్రకృతి వ్యవసాయం పట్ల చైతన్యపర్చేందుకు ఈ సినిమా రూపొం దిస్తున్నట్టు తెలిపారు.