Allu Arjun : నేషనల్ అవార్డు అందుకోవడానికి బయలుదేరిన అల్లు అర్జున్.. పిక్స్ వైరల్..!

బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డుకి అల్లు అర్జున్ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ అవార్డు అందుకోవడానికి బన్నీ..

Pushpa star Allu Arjun went to delhi for taking best actor national award

Allu Arjun National Award : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డుకి ఎన్నికైన సంగతి తెలిసిందే. పుష్ప సినిమాలో తన నటనకు గాను బన్నీ ఈ అవార్డుని అందుకుంటున్నాడు. టాలీవుడ్ హిస్టరీలో ఇప్పటివరకు ఈ అవార్డు ఒక కలలా ఉండేది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఈ పురస్కారం అందుకున్న మొదటి నటుడిగా అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇక జాతీయ అవార్డుల పురస్కారం.. రేపు అక్టోబర్ 17న ఢిల్లీలో జరగనుంది. దీంతో నేషనల్ అవార్డు విన్నర్స్ అంతా దేశరాజధాని బాట పట్టారు.

ఈక్రమంలోనే అల్లు అర్జున్ కూడా ఢిల్లీకి పయనం అయ్యాడు. బన్నీ సతీమణి అల్లు స్నేహారెడ్డి కూడా ఈ వేడుకకు వెళ్తున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అల్లు అర్జున్ దంపతులు ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. టాలీవుడ్ కి వస్తున్న మొదటి ఉత్తమ జాతీయ నటుడు అవార్డు కావడంతో ఈ పురస్కార వేడుక చూసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అవార్డు అందుకొని హైదరాబాద్ తిరిగి వచ్చే అల్లు అర్జున్ కి గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు అభిమానులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

Also read : క్రాక్‌, టైగర్ నాగేశ్వరరావు మధ్య కనెక్షన్.. ఇది రవితేజ సినిమాటిక్ యూనివర్స్..

కాగా ఈ ఏడాది టాలీవుడ్ కి నేషనల్ అవార్డుల పంట పండింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారంలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ‘ఉప్పెన’, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ‘RRR’, బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ‘పురుషోత్తమ చార్యులు’, బెస్ట్ యాక్టర్ ‘అల్లు అర్జున్’, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీప్రసాద్ (పుష్ప సాంగ్స్), కీరవాణి (RRR బ్యాక్‌గ్రౌండ్ స్కోర్), ఉత్తమ గాయకుడు ‘కాలభైరవ (కొమరం భీముడో – RRR)’ బెస్ట్ లిరిక్స్ ‘చంద్రబోస్ (కొండపోలం మూవీ)’, బెస్ట్ స్టంట్ మాస్టర్ ‘కింగ్ సోలొమాన్ (RRR)’ బెస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్ ‘ప్రేమ్ రక్షిత్ (RRR)’, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ‘వి శ్రీనివాస్ మోహన్ (RRR)’.. ఎంపికయ్యారు. రేపు వీరంతా కూడా ఈ అవార్డులను అందుకోనున్నారు.