Raviteja : క్రాక్, టైగర్ నాగేశ్వరరావు మధ్య కనెక్షన్.. ఇది రవితేజ సినిమాటిక్ యూనివర్స్..
క్రాక్, టైగర్ నాగేశ్వరరావు సినిమా మధ్య ఒక కనెక్షన్ ఉందట. అదేంటో తెలిస్తే మీరు థ్రిల్ ఫీల్ అవుతారు.

Raviteja krack and Tiger Nageswara Rao connection
Raviteja : రవితేజ ఈ దసరాకి ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్, డైరెక్టర్స్ హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని తదితరులు వచ్చారు. ఇక ఈ వేదిక పై గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ఇంటరెస్టింగ్ విషయం అభిమానులకు తెలియజేశాడు. క్రాక్, టైగర్ నాగేశ్వరరావు సినిమా మధ్య ఒక కనెక్షన్ ఉందట. అదేంటో తెలిస్తే మీరు థ్రిల్ ఫీల్ అవుతారు.
టైగర్ నాగేశ్వరరావు సినిమా స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక రవితేజ, దర్శకుడు గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన క్రాక్ సినిమా కూడా నిజ జీవిత పాత్రలు ఆధారంగా తెరకెక్కిందే. ఒంగోలు ప్రాంతంలో సీఏ మురళి, రౌడీ కఠారి కృష్ణ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు తీసుకోని.. గోపీచంద్ ఆ సినిమాని తెరకెక్కించాడు. అయితే అదే సీఏ మురళి.. టైగర్ నాగేశ్వరరావుని పట్టుకోవడానికి కూడా ప్రయత్నించాడట.\
Also Read : Tiger 3 Trailer : టైగర్ 3 ట్రైలర్ రిలీజ్.. దేశం కోసం, ఫ్యామిలీ కోసం టైగర్ పోరాటం..
View this post on Instagram
ఒంగోలు కంటే ముందు స్టువర్టుపురం ప్రాంతంలో ఆ పోలీస్ పని చేశాడట. ఈ విషయాన్ని గోపిచంద్ మలినేని నిన్న తెలియజేయడంతో ఆడియన్స్ బాగా హై ఫీల్ అయ్యారు. దీంతో అభిమానులు ఇది రవితేజ సినిమాటిక్ యూనివర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం తరువాత రవితేజ, గోపీచంద్ మలినేని కలిసి మళ్ళీ మరో మూవీ చేయబోతున్నారు. మరి ఈ సినిమాలో ఎలాంటి పాత్రని చేస్తాడో చూడాలి. కాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 20న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో రవితేజ మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు.