Allu Arjun : ఇద్దరిలో ఎవరితో బన్నీ పాన్ ఇండియా మూవీ?

‘పుష్ప’ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి చేరుకుంది..

Allu Arjun : ఇద్దరిలో ఎవరితో బన్నీ పాన్ ఇండియా మూవీ?

Bunny

Updated On : January 23, 2022 / 3:25 PM IST

Allu Arjun: ‘పుష్ప’ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి చేరుకుంది. ఇప్పటివరకు తెలుగు, మలయాళంకి మాత్రమే తెలిసిన బన్నీ నార్త్‌లో సాలిడ్ ఎంట్రీ ఇచ్చాడు. అసలు విడుదల చేద్దామా? వద్దా? అనే సందిగ్ధంలో ఉంటూనే హిందీలో రిలీజ్ చేశారు.

Ala Vaikunthapurramuloo : హిందీలో నో థియేట్రికల్ రిలీజ్.. కానీ..
కట్ చేస్తే.. ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్లు కొల్లగొట్టింది ‘పుష్ప’. హిందీ డిస్ట్రిబ్యూటర్‌కి దాదాపు రూ. 50 కోట్లకు పైగానే లాభం వచ్చింది. దీంతో పార్ట్ 2కి ఏకంగా రూ. 100 కోట్లు ఆఫర్ చేసారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే బన్నీతో సినిమా చెయ్యడానికి తమిళ్ డైరెక్టర్లు ఇద్దరు లైన్‌లో ఉన్నారు.  వాళ్లల్లో ఒకరు స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్. మురగదాస్.. ఇంకొకరు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ.

Allu Arjun : ‘‘సౌత్ కా సుల్తాన్’’.. ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్..

మురగదాస్ ఇప్పటికే బన్నీకి స్టోరీ నేరేట్ చేశారు. కానీ ఐకాన్ స్టార్ క్లారిటీ ఇవ్వలేదట. అయితే ముందుగా అట్లీతో సినిమా చెయ్యడానికి అల్లు అర్జున్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని సమాచారం. అల్లు అర్జున్, అట్లీ, అనిరుధ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ఈ ప్రెస్టీజియన్ పాన్ ఇండియా సినిమాను ఓ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించనుంది.

BBB: బాలయ్య-బోయపాటి-బన్నీ మల్టీస్టారర్.. రచ్చ రచ్చేనా?