Rocketry : ఇస్రోకు పంచాంగంతో ముడిపెట్టిన హీరో మాధవన్‌.. ఏకిపారేసిన నెటిజన్లు..!

R Madhavan : సైన్స్ అనేది అనంతం.. అలాంటి సైన్సుకు పంచాగానికి ముడిపెట్టిన నటుడు మాధవన్‌పై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. నోరు జారిన మాధవన్‌పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

R Madhavan : సైన్స్ అనేది అనంతం.. అలాంటి సైన్సుకు పంచాగానికి ముడిపెట్టిన నటుడు మాధవన్‌పై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. నోరు జారిన మాధవన్‌పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సైన్స్ పరమైన విషయాలపై పూర్తి అవగాహన లేకుండా మాట్లాడితే ఎన్ని అనార్థాలకు దారితీస్తుందో ఇదే ఉదాహరణగా చెప్పవచ్చు.

కోలివుడ్ నటుడు మాధవన్ దర్శకత్వం వహించిన మూవీ రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్ (Rocketry: The Nambi Effect). ఈ మూవీ జూలై 1న రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మాధవన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

R Madhavan Gets Trolled For Claiming Isro Used Hindu Calendar For Mars Mission

మార్స్ మిషన్ పూర్తి చేసేందుకు అంతరిక్షంలోకి రాకెట్ పంపడానికి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO)కు పంచాగం (హిందూ క్యాలెండర్) తోడ్పడిందని మాధవన్ వ్యాఖ్యానించాడు. అంతే.. నెటిజన్లు మాధవన్‌ను ఏకిపారేస్తున్నారు. మాధవన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాధవన్ పై భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు. నీకు సైన్స్ గురించి తెలియకపోతే పర్వాలేదు.. వాటి గురించి అవగాహన లేనప్పుడు మాట్లాడకపోవడమే మంచిది.

అంతేకానీ. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని నెటిజన్లు మండిపడ్డారు. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ మాజీ శాస్త్రవేత్త, ఇస్రో ఏరోస్పేస్ ఇంజినీర్ నంబి నారాయణ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. నంబి నారాయణపై గూఢచర్యం ఆరోపణలు వచ్చాయి. ఈ మూవీలో మాధవన్ టైటిల్ రోల్‌లో నటించారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో మూవీ రిలీజ్ కాబోతోంది.

Read Also : DJ Tillu: మళ్లీ లొల్లి షురూ చేస్తోన్న డీజే టిల్లు!

ట్రెండింగ్ వార్తలు