Raashii Khanna : పేరెంట్స్ తో కలిసి కాశీలో బర్త్ డే జరుపుకున్న రాశి ఖన్నా.. ఫొటోస్ వైరల్

రాశి ఖన్నా తన బర్త్ డే ను పేరెంట్స్ తో కలిసి పవిత్ర కాశీలో జరుపుకుంది.

Raashi Khanna celebrated her birthday in Kashi with her parents

Raashii Khanna : టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ బ్యూటీ. కేవలం సినిమాలే కాకుండా సిరీస్ కూడా చేసింది. బాలీవుడ్ లో కూడా పలు మూవీస్ చేసి అక్కడ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ కూడా స్టార్ట్ చేసారు మేకర్స్.

Also Read : Matka : 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న వరుణ్ తేజ్ మట్కా.. ఎప్పుడు, ఎందులో అంటే..

అయితే నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు. ఈ సందర్బంగా రాశి ఖన్నా స్పెషల్ ఫొటోస్ షేర్ చేసింది. తన బర్త్ డే ను పేరెంట్స్ తో కలిసి పవిత్ర కాశీలో జరుపుకుంది. సాంప్రదాయ దుస్తుల్లో తన తల్లి,తండ్రి ఆశిర్వాదాలను తీసుకుంది. కాశీలో హోమం కూడా జరిపించింది. వాటికి సంబందించిన వీడియోలను, ఫోటోలను షేర్ చెయ్యగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాదు స్కూల్ పిల్లలతో కూడా తన బర్త్ డే జరుపుకుంది. పిల్లలతో కేక్ కట్ చేసి వారికి ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చింది.


అలాగే తన పుట్టిన రోజు సందర్బంగా చాలా మంది సినీ సెలబ్రిటీస్ సైతం బర్త్ డే విషెస్ తెలిపారు. ఆమె నటిస్తున్న తెలుసు కదా మూవీ సినిమా టీమ్ కూడా విషెస్ తెలుపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో రాశిఖన్నా తో పాటు శ్రీనిధి కూడా హీరోయిన్ గా నటిస్తుంది.