Robinhood : రష్మిక పోయి రాశి వచ్చే.. నితిన్ ‘రాబిన్ హుడ్’ అప్డేట్..

నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమాలోకి రష్మిక పోయి రాశి వచ్చే.

Robinhood : ‘భీష్మ’తో సూపర్ హిట్ అందుకున్న నితిన్, రష్మిక మందన్న, దర్శకుడు వెంకీ కుడుముల.. మరోసారి జంట కడుతూ ‘రాబిన్ హుడ్’ సినిమాని ప్రకటించారు. ఈ హిట్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందని తెలియడంతో.. ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఏమైందో ఏమో రష్మిక.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇక ఈ స్థానంలోకి శ్రీలీల రాబోతుందని మొన్నటివరకు టాక్ వినిపించింది.

అయితే ఇప్పుడు ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న వార్త ఏంటంటే.. రష్మిక ప్లేస్ లోకి రాశిఖన్నా వచ్చారట. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసపెట్టి సినిమాలు చేస్తూ అక్కడ బిజీ అవుతున్న రాశిఖన్నా.. తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ సరసన ఓ సినిమాకి సైన్ చేసారు. ఇప్పుడు తాజాగా రాబిన్ హుడ్ సినిమాకి కూడా ఓకే చెప్పారట. కాగా నితిన్ అండ్ రాశి గతంలో ‘శ్రీనివాస కళ్యాణం’లో కలిసి నటించారు.

Also read : My Dear Donga Trailer : ‘మై డియర్ దొంగ’ ట్రైలర్ చూశారా?.. దొంగతో ఫ్రెండ్షిప్ చేస్తే.. ఆహాలో మరో కొత్త సినిమా..

ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయినా.. నితిన్, రాశి జోడికి మంచి మార్కులు పడ్డాయి. అయితే రాశి నిజంగానే ఈ ప్రాజెక్ట్ లోకి అడుగుపెడుతున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. జివి ప్రకాష్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

కాగా భీష్మ తరువాత నితిన్ కి ఒక్క హిట్ పడలేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని బాగా కసితో ఈ సినిమా చేస్తున్నారు. మరి భీష్మతో ఒకేసారి సూపర్ హిట్టుని అందించిన వెంకీ కుడుములు.. రెండోసారి కూడా భారీ విజయాన్ని అందిస్తారా లేదా చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు