My Dear Donga Trailer : ‘మై డియర్ దొంగ’ ట్రైలర్ చూశారా?.. దొంగతో ఫ్రెండ్షిప్ చేస్తే.. ఆహాలో మరో కొత్త సినిమా..

అభినవ్ గోమటం మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న 'మై డియర్ దొంగ' ట్రైలర్ రిలీజ్ అయ్యింది మీరు చూశారా..?

My Dear Donga Trailer : ‘మై డియర్ దొంగ’ ట్రైలర్ చూశారా?.. దొంగతో ఫ్రెండ్షిప్ చేస్తే.. ఆహాలో మరో కొత్త సినిమా..

Abhinav Gomatam Shalini Divya My Dear Donga Trailer released

Updated On : April 18, 2024 / 12:19 PM IST

My Dear Donga Trailer : తెలుగు ఓటీటీ ఆహాలో ఇటీవల కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మై డియర్ దొంగ అనే సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతుంది. అభినవ్ గోమటం మెయిన్ లీడ్ లో, శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్.. పలువురు ముఖ్య పాత్రలతో క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మాణంలో సర్వాంగ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరెక్కింది.

మై డియర్ దొంగ సినిమా ఆహా ఓటీటీలో ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ప్రియదర్శి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ట్రైలర్ లో.. ఒక దొంగ దొంగతనం చేస్తూ ఓ అమ్మాయికి దొరికితే వాడి కష్టాలు చెప్పి ఆ అమ్మాయికి ఫ్రెండ్ గా ఎలా మారాడు? ఆ తర్వాత ఏం జరిగింది అనే సరికొత్త కాన్సెప్ట్ తో ఉండబోతున్నట్టు చూపించారు. మై డియర్ దొంగ సినిమా మొత్తం ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

Also read : Teja Sajja : తేజ సజ్జ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ అదిరిందిగా.. అశోకుడి రహస్యంతో ‘మిరాయ్’..

ఇక ఈ సినిమాని షాలిని కొండేపూడి రచించి తానే ముందుండి అన్ని రెడీ చేసుకొని తనే ఫిమేల్ లీడ్ లో నటించి మై డియర్ దొంగ ప్రాజెక్టు ని ముందుకు తీసుకొచ్చినట్టు మూవీ యూనిట్ తెలిపారు. అభినవ్ 2014లో జగన్నాటకం అనే సినిమాలో దొంగ పాత్రలో నటించగా పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ దొంగ పాత్రలో రాబోతున్నాడు. ఈ రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అర్సడానే సంగీత దర్శకుడు కావడం గమనార్హం. ఇక ఇది వెబ్ సిరీస్ గా తీద్దామనుకొని తర్వాత సినిమా కథగా మార్చినట్టు షాలిని తెలిపింది. షాలిని, ప్రియదర్శి, అభినవ్ గోమటం పదేళ్ల నంచి స్నేహితులని, ప్రియదర్శి దర్శకత్వంలో ఒక షార్ట్ ఫిలిం చేసానని, ఇప్పుడు షాలిని స్క్రిప్ట్ లో నటించానని అభినవ్ గోమటం తెలిపాడు.