Radha Madhavam : గ్రామీణ ప్రేమ కథా చిత్రం.. ‘రాధా మాధవం’ పోస్టర్‌ రిలీజ్..

ప్రస్తుతం రాధా మాధవం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ సినిమా. తాజాగా రాధా మాధవం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.

Radha Madhavam New Village Love Movie Poster Launch

Radha Madhavam : ఇటీవల చిన్న సినిమాలు, గ్రామీణ ప్రేమ కథలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఎన్ని జామర్లు వచ్చిన నాప్రేమ కథా చిత్రాలు వస్తూనే ఉంటాయి. సినిమా బాగుంటే ఆదరిస్తారు. తాజాగా మరో గ్రామీణ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త వాళ్ళు వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ జంటగా దాసరి ఇస్సాకు దర్శకత్వంలో గోనాల్ వెంకటేష్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘రాధా మాధవం’.

ప్రస్తుతం రాధా మాధవం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ సినిమా. తాజాగా రాధా మాధవం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ నెలలోనే సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇటీవల రాధామాధవం మూవీ ఫస్ట్ లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను డీపీఎస్ ఇన్‌ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డా.DSN రాజు రిలీజ్ చేశారు.

Also Read : Salaar Movie : సలార్ పార్ట్ 1 సినిమా ప్రభాస్ ది కాదా? పృద్విరాజ్ సుకుమారన్ హీరోనా?

అనంతరం ఆయన చిత్రయూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొన్నారు. ఇక ఈ పోస్టర్ లో హీరో, హీరోయిన్స్ పెళ్లి పీటల మీద ఉన్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ లోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.