Radhika Sarathkumar : టికెట్ రేట్లపై మాట్లాడుతూ.. స్టార్ హీరోలకు గట్టి కౌంటర్ ఇచ్చిన రాధికా శరత్ కుమార్..
రాధికా శరత్ కుమార్ టికెట్ రేట్లపై మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా స్టార్ హీరోలకు కౌంటర్ ఇచ్చారు. (Radhika Sarathkumar)
- Saketh U
- Published On : March 12, 2026 / 12:13 PM IST
Radhika Sarathkumar
Radhika Sarathkumar : ఇటీవల స్టార్ హీరోల సినిమాలకు టికెట్ రేట్లు దారుణంగా పెంచేస్తున్న సంగతి తెలిసిందే. కలెక్షన్స్ కోసం ఫ్యాన్స్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు నిర్మాతలు. తెలుగులోనే కాదు, తమిళ్, బాలీవుడ్ లో కూడా టికెట్ రేట్లు స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువగానే ఉంటున్నాయి. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా కనీసం మూడు రోజులకు మొదటి వీకెండ్ అయ్యాక కూడా టికెట్ రేట్లు తగ్గించట్లేదు.
తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్, సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ టికెట్ రేట్లపై మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా స్టార్ హీరోలకు కౌంటర్ ఇచ్చారు. రాధికా శరత్ కుమార్ మెయిన్ లీడ్ లో ఓ ముసలి పాత్రలో నటించిన తమిళ సినిమా తాయి కిళవి ఇటీవల రిలీజయి పెద్ద సక్సెస్ సాధించింది. ఈ సినిమా ఆల్మోస్ట్ 60 కోట్లకు పైగా కలెక్ట్ చేసి థియేటర్స్ లో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.
Also Read : Deewana : ఎంత అందంగా ఉంటే అంత సతాయిస్తారురా పోరీలు.. ‘దీవాన’ టీజర్ రిలీజ్..
తాయి కిళవి సినిమా సక్సెస్ మీట్ లో రాధికా శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఆల్మోస్ట్ 60 కోట్లు కలెక్ట్ చేసింది కేవలం 150 రూపాయలు టికెట్ రేటుతో. కొంతమంది పెద్ద హీరోలు తమ సినిమాల టికెట్స్ ని 1500 నుంచి 2000 వరకు కూడా అమ్ముతున్నారు. మీరు కరెక్ట్ గా ఆలోచిస్తే మేము వాళ్ళకంటే పెద్ద సక్సెస్ సాధించినట్టే. ఇది నిజమైన సక్సెస్ అని కామెంట్స్ చేసింది.
దీంతో రాధికా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. స్టార్ హీరోలకు కౌంటర్ ఇచ్చిందని, ఇప్పటికైనా కంటెంట్ బాగుంటే సినిమా హిట్ అయి కలెక్షన్స్ వస్తాయని తెలుసుకోవాలని, టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
"This film collected 50–60 crores with a ₹150 ticket rate. Some big hero films sold tickets for ₹1500–₹2000. If you look at it rightfully, we have done better than everybody else. That’s the true success.."
– #Radhika at #ThaaiKizhavi Event pic.twitter.com/8GAAzHY9ZR
— Laxmi Kanth (@iammoviebuff007) March 11, 2026
Also Read : Monalsia : మోనాలిసా ది ప్రేమ వివాహం కాదు.. లవ్ జీహాద్.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు..
