Radhika Sarath Kumar : మా నాన్నకి, ఎంజీఆర్‌కి మధ్య గొడవలని వెబ్‌సిరీస్‌లా తీస్తాను

ఇంటర్వ్యూలో వాటి గురించి రాధిక మాట్లాడుతూ.. ''మా ఫాదర్ వివాదాస్పదమైన వ్యక్తి అనే విషయం తెలిసిందే. అప్పట్లో ఆయనకి, ఎంజీఆర్‌కి ఏవో గొడవలు ఉండేవి. వాళ్లిద్దరి మధ్య జరిగిన కాల్పుల.....

Radhika Sarath Kumar :  మా నాన్నకి, ఎంజీఆర్‌కి మధ్య గొడవలని వెబ్‌సిరీస్‌లా తీస్తాను

Radhika

Updated On : April 20, 2022 / 4:05 PM IST

Radhika Sarath Kumar :  ఒకప్పటి హీరోయిన్ రాధిక మెగాస్టార్ చిరంజీవి తో కలిసి అనేక సినిమాలు చేశారు. వాళ్ళిద్దరి కాంబినేషన్స్ లో చాలా సినిమాలు వచ్చి తెలుగులో భారీ విజయాలు సాధించాయి. ప్రస్తుతం రాధిక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి, అక్క పాత్రలు చేస్తుంది. ఇటీవలే ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది రాధిక. తాజాగా రాధిక ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలని వెల్లడించారు.

Nani : ‘అంటే సుందరానికి’ టీజర్ లాంచ్ ఈవెంట్

రాధిక తండ్రి ఎం.ఆర్.రాధా హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. అయితే రాధిక తండ్రికి అప్పటి తమిళ్ స్టార్ హీరో, మాజీ సీఎం ఎంజీఆర్ కి గొడవలు ఉండేవి. తాజాగా ఆ గొడవలపై రాధిక స్పందించింది. ఈ ఇంటర్వ్యూలో వాటి గురించి రాధిక మాట్లాడుతూ.. ”మా ఫాదర్ వివాదాస్పదమైన వ్యక్తి అనే విషయం తెలిసిందే. అప్పట్లో ఆయనకి, ఎంజీఆర్‌కి ఏవో గొడవలు ఉండేవి. వాళ్లిద్దరి మధ్య జరిగిన కాల్పుల సంఘటన గురించి అందరికి తెలుసు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ సంఘటన, వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవల నేపథ్యంలో ఒక వెబ్ సిరీస్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. జులై నుంచి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతుంది” అని తెలిపారు.